Unmarried Heroines: 50 ఏళ్ళు దాటినా పెళ్ళి మాత్రం వద్దు… అంటున్న హీరోయిన్స్ ! సినిమా రంగంలో డేటింగ్, షూటింగ్ లు చాలా కామన్. నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు, మొత్తానికి రంగుల ప్రపంచంలో ఉన్న వారి జీవితాల్లో ఎన్నో రంగులు లొసుగులు ఉంటాయి. ఇక ప్రేమ, పెళ్లి, విడాకులు కూడా సర్వసాధారణం. అయితే.. కొంతమంది భామలు మాత్రం ప్రేమించినా పెళ్ళికి మాత్రం దూరంగా ఉన్నారు.
తమ అందచందాలతో ప్రేక్షకులను అందాల కలల ప్రపంచంలో విహరింప చేసిన ఈ తారలు వయసు పై పడినా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు ? ఇంతకీ వాళ్లెవరు ? వాళ్లెందుకు పెళ్లి చేసుకోలేదు చూద్దాం.
#1) టబు :
ఈ లిస్ట్ లో ముందుగా ముచ్చటించుకోవాల్సింది టబు గురించే. ఒకప్పటి టాప్ హీరోయిన్. ఏభై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వల్ల తన సంతోషాలు సరదాలు కోల్పోతాను అని, అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను అని ఓ సందర్భంలో టబు చెప్పింది. ఇక ఇప్పటికీ టబు బోల్డ్ పాత్రల్లో నటిస్తోంది. మనసుకు నచ్చిన సరైన పార్ట్నర్ దొరకినా డేటింగ్ చేస్తోంది గాని, పెళ్లి మాత్రం చేసుకోదట.
#2) సుష్మితా సేన్ :
బోల్డ్ సమాజంలో ఎదురులేని మరో ముదురు హీరోయిన్ సుష్మితా సేన్. వయసు అయిపోతున్నా ఇంకా ఒంటరి జీవితాన్నే గడుపుతుంది. అయితే, ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. కానీ గత ఏడాది వరకు రొమన్ షాల్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఇప్పుడు అతన్ని వదిలేసింది అనుకోండి. ప్రస్తుతానికి అయితే ఒంటరి బతుకులోని బతుకు ఉంది అంటుంది.
#3) శోభన :
ఇప్పటికీ మంచి క్లాసిక్ డ్యాన్సర్ గానే మిగిలిపోయింది. అయితే, ఒకప్పుడు శోభన క్లాస్ హీరోయిన్. ఇక 51 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు. కారణం.. నాట్యం పై ఆమెకున్న అమితమైన అభిరుచేనట. తన జీవితాన్ని నాట్యానికి త్యాగం చేశాను అని చెబుతుంది.
#4) అమీషా పటేల్ :
టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అమీషా. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తన జీవితంలో ఎంతమంది మగాళ్లను చూసినా తనకు సరైన పార్ట్నర్ అనే భావన కలగలేదు అట. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు అని చెబుతుంది.
#5) నగ్మా :
టాలీవుడ్ లోనే కాదు హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ లాంటి భాషల్లోనూ తనదైన గ్లామర్ తో మెరుపులు మెరిపించిన హీరోయిన్. వయసు దాటిపోతున్నా ఇంకా ఒంటరిగానే ఉంటుంది. పెళ్లి పేరు చెబితే.. పారిపోతుంది. రెండు సార్లు ప్రేమలో విఫలమవడంతో ఒంటరిగా ఉండటానికి నగ్మా అలవాటు పడిపోయినట్టు ఉంది.
#6) సితార :
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ లోకంలో ఒక వెలుగు వెలిగిన నటి సితార. తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చినా.. పైగా వయసు అయిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. నిజానికి పెళ్లి చేసుకోవాలనుకున్నా సితారకు కాలం కలిసి రాలేదు. తనను సరిగ్గా గైడ్ చేసేవారు లేకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని సితార ఫీల్ అవుతూ ఉంటుంది.
#7) నర్గీస్ ఫక్రీ :
హిందీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు నర్గీస్ ఫక్రీది. ఆమె అందాల కనువిందుల గురించి ఎంత మొర పెట్టుకున్నా అది ఎప్పటికీ తనవి తీరనది కాబట్టి.. ఆ బాగోతాన్ని వదిలేద్దాం. వయసు అయిపోతున్నా నర్గీస్ ఫక్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కారణం.. ప్రతి ఏడాది కొత్త ప్రేమలకు అలవాటు పడటం, అలాగే కుటుంబ బంధాల పై సరైన అభిప్రాయం లేకపోవడమే, అలాగే ఆమె విచ్చలవిడి ఒంటరితనానికి అడ్డుఅదుపు లేకపోవడం కూడా. ఏది ఏమైనా ఈ ముదురు భామలు ఇలా ఒంటరిగా మిగిలిపోవడం బాధాకరమైన విషయమే.
Also Read: Samantha: కుమార్తె పెళ్లి కోసం కాదు… ఆమె చదువు కోసం డబ్బు దాచి పెట్టండి : సమంత