Homeఎంటర్టైన్మెంట్Kalpika Ganesh : హీరోయిన్ సీక్రెట్ పెళ్లి: లెంపలేసుకున్న కల్పికా గణేష్

Kalpika Ganesh : హీరోయిన్ సీక్రెట్ పెళ్లి: లెంపలేసుకున్న కల్పికా గణేష్

Kalpika Ganesh : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. అదే ఆ నోరు లైన్ తప్పితే ఊరంతా వ్యతిరేకమవుతుంది. ఈ నానుడి తమిళ నటి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కల్పికా గణేష్ విషయంలో నిజమైంది.. వాస్తవానికి కల్పిక మంచి నటి. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి కానీ.. తమిళంలో మాత్రం చాలెంజింగ్ రోల్స్ చేసింది. అప్పట్లో ఆమె తమిళంలో ఒక రేంజ్ కు వెళ్తుంది అని అందరూ అనుకున్నారు. ప్రతినాయక పాత్రలు పోషించడంతో వరలక్ష్మి శరత్ కుమార్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది అని కూడా అనుకున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. ఈ యాక్టింగ్ చేసే నైపుణ్యం, చూడ చక్కని రూపం ఉన్నప్పటికీ తన నోటికి అడ్డూ అదుపు లేకపోవడంతో విమర్శల పాలయింది. వార్తల్లో వ్యక్తి అయింది గానీ.. సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఇది ఆమె కెరియర్ కు ప్రతిబంధకంగా మారింది. ఒకానొక దశలో కల్పికా గణేష్ సోయిలేకుండా విమర్శలు చేసింది. అలాంటిదే ధన్య బాలకృష్ణ అనే నటిపై చేసిన చవక బారు విమర్శ.
క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది
ఎదుటివారిని తిట్టడం సులభమే. తిరిగి వారు తిడితేనే తట్టుకోవడం కష్టం. అది ఇప్పుడు కల్పిక గణేష్ కు సోదాహరణంగా అర్థమైంది. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటంటే.. ధన్య బాలకృష్ణ అనే ఒక తమిళ నటి ఉంది. తెలుగులో కూడా సినిమా చేసింది. ఆ మధ్య జబర్దస్త్ సుధీర్ తో కలిసి సాఫ్ట్వేర్ సుధీర్ అనే ఒక సినిమాలో కూడా నటించింది. అయితే ఆమె బాలాజీ మోహన్ అనే తమిళ దర్శకుడి ని రహస్యంగా పెళ్లి చేసుకుందని కల్పిక గణేష్ ఓ యూట్యూబ్ ఛానల్ లో తిక్క వాగుడు వాగింది. ఇవి సోషల్ మీడియా రోజులు కాబట్టి, యూట్యూబర్లు ఈ వీడియోను రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చారు. విధంగా ఇది తమిళనాడు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా వివాదాస్పదమైంది. దీనిపై అటు ధన్య బాలకృష్ణ కూడా స్పందించింది. ఇద్దరి మధ్య ఏడాది పాటు తిట్ల పురాణం సాగింది. దీంతో ఒళ్ళు మండిన బాలాజీ మోహన్ కల్పికా గణేష్ మీద పరువు నష్టం దావా వేశాడు. ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తానికి కల్పికా గణేష్ దారికి వచ్చింది. ఏడాది పాటు సాగిన గొడవకు తన ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ వ్యవహారంలో తనదే మొత్తం తప్పని, ఇకపై ఆరోపణలు చేయనని, ఒక సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తప్పయింది క్షమించండి అని లెంపలేసుకున్నంత పని చేసింది.
తప్పుడు ఆరోపణలు
“తప్పుడు ఆరోపణలు ఇన్ని రోజులు మీ మీద చేశాను. నేను మీపై చేసిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. మనస్ఫూర్తిగా మీకు, మీ కుటుంబానికి, అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ” అంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పికా గణేష్ పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. అటు బాలాజీ మోహన్ కూడా మద్రాస్ హైకోర్టులో తన వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. అయితే అంతకంటే ముందే న్యాయస్థానం కల్పిక క్షమాపణలు చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో అలాగే ఉంచాలని ఆదేశించింది..కాగా “మారి” ఇప్పుడు బాలాజీ మోహన్ కు ఇది రెండవ పెళ్లి. 2020 జనవరి నెలలో అతడు ధన్య బాల కృష్ణను వివాహం చేసుకున్నాడు. బాలాజీ మోహన్ ఇదివరకు తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. “మారి, మారి_2, వాయై మూడి పేవుసం” వంటి చిత్రాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధన్య కూడా అటు తెలుగు ఇటు తమిళంలో కూడా చిత్రాల్లో నటించింది. మొత్తానికి ఈ సుదీర్ఘ ఎపిసోడ్ కల్పిక గణేష్ క్షమాపణ చెప్పడంతో ముగిసిపోయింది.. అందుకే అంటారు పెద్దలు నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా నోరు అదుపులో లేకపోతే ఎలాంటి ఉపద్రవాలు చవిచూడాల్సి వస్తుందో గతంలో అనేక సంఘటనలు నిరూపించాయి. వాటిని చూసైనా కల్పికా గణేష్ సైలెంట్ గా ఉంటే బాగుండేది. ఇప్పుడు క్షమాపణ చెప్పింది కాబట్టి ఇకనైనా కల్పికా గణేష్ కు అవకాశాలు వస్తాయా? ఏమో దీనికి తమిళ చిత్ర పరిశ్రమ దర్శకుల సమాధానం చెప్పాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular