అంతా సమసిపోయిందనుకుంటున్న సమయంలో.. ఎరక్కపోయి కామెంట్స్ చేసిన హీరోయిన్ ధాటికి ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. టాలీవుడ్ హీరోయిన్ నుంచి బీజేపీలోకి చేరిన హీరోయిన్ ఇప్పుడు అనవసరంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఇటీవల టాలీవుడ్ లో డ్రగ్స్ దందా గురించి వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు పార్టీల్లో డ్రగ్స్ వాడటం కామన్ అంటూ మాధవీలత పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. దీనిపై ఎన్.సీబీ అధికారులు, ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆమె పోస్టులో కోరారు.
మాధవీలత తాను ఐదేళ్ల క్రితం ఓ పార్టీకి వెళ్లినప్పుడు పలువురు సెలెబ్రెటీలు డ్రగ్స్ తీసుకోవడం చూశానని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.. అప్పట్లో సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా రావడం.. అవకాశాలు రావేమోనన్న భయంతో ఈ విషయాలను బయటపెట్టలేకపోయానని అందామె.. ఎందుకంటే దీనివెనుక పెద్ద మాఫియాలు ఉంటాయని ఆమె అనుమానించింది. ఇప్పటికీ భయం ఉన్నా.. బాధ్యతల సిటిజన్ గా.. బీజేపీలో కార్యకర్తగా ఉన్నందున ఈ విషయాన్ని చెప్పానని తెలిపింది.
కాగా నటి మాధవీలత చేసిన డ్రగ్స్ ఆరోపణలపై తెలంగాణ పోలీసులు సీరియస్ అయ్యారు.డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేకమందిని అరెస్ట్ చేశామని.. టాలీవుడ్ సెలెబ్రెటీలను విచారించామని.. కొందరిని నిఘాలో పెట్టామని.. ఆధారాలుంటే టాలీవుడ్ సెలెబ్రెటీలను వదలమని ఎక్సైజ్ పోలీసులు మాధవీలతకు స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది.
టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని టీ పోలీసులు కోరారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని నటి మాధవీలతకు సూచించారు..