Tollywood
Tollywood : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పెళ్లి వార్తలు చాలానే వినిపిస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్లు తమ చిన్ననాటి ప్రేమలను నిజం చేసుకుని పెళ్లి చేసుకున్నారు. మరికొందరు సహా నటీనటులను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు. అయితే, కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేమ కోసం తమ మతాన్ని కూడా మార్చుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా టకియా.
ఆయేషా టకియా 2000 దశకంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. ఆమె తన ప్రేమ కోసం మతం మార్చుకుని ఓ రాజకీయ కుటుంబానికి కోడలు అయింది. 15 ఏళ్ల పాటు ఈ విషయం గోప్యంగా ఉంది. ఇటీవలే తను మతం మార్చుకున్న విషయం బయటపడింది.
తెలుగు ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన “సూపర్” (2005) సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మరో హీరోయిన్‌గా నటించింది ఆయేషా టకియా. తొలి సినిమాతోనే అందంతో, అభినయంతో అందరి మనసులు దోచుకుంది. కానీ, తెలుగు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్‌కే పరిమితం అయింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
ఆయేషా టకియా ప్రేమలో పడిన వ్యక్తి ఎవరో తెలుసా? సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీ. ఫర్హాన్ అజ్మీ ఓ ప్రముఖ వ్యాపారవేత్త. అతని కుటుంబం రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తుంది. ఫర్హాన్‌తో మూడు సంవత్సరాలపాటు డేటింగ్ చేసిన ఆయేషా, 2009లో అతనిని వివాహం చేసుకుంది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆయేషా టకియా తన మతాన్ని మార్చుకుంది. హిందూ మతానికి చెందిన ఆమె, ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘ఆయేషా టాకియా అజ్మీ’గా మారింది. అయితే, ఈ విషయం అప్పట్లో పెద్దగా వెలుగులోకి రాలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయేషా తన పెళ్లి విషయాలను వెల్లడించింది. తాను ఫర్హాన్‌ను ఎంతగా ప్రేమించానో, పెళ్లి కోసం తీసుకున్న నిర్ణయాన్ని గురించి చెప్పింది. “ఇది నా జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఒకటి. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవడం కోసం మత మార్చుకోవడం నాకు పెద్ద సమస్య కాదు” అని చెప్పింది. పెళ్లి తర్వాత ఆయేషా టకియా పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతూ తన వ్యాపారాలను చూసుకుంటోంది. సినిమా రంగంలో సక్సెస్ అయినా, ప్రేమ కోసం ఓ హీరోయిన్ మతం మార్చుకుని రాజకీయ కుటుంబానికి కోడలవ్వడం అరుదైన విషయం.