https://oktelugu.com/

Vaishnavi Chaitanya: ఆనంద్, విరాజ్ లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావంటే మన ‘బేబీ’ సమాధానం ఇదీ!

థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన బేబీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా బేబీ ఓటీటీ హక్కులు దక్కించుకుంది.

Written By:
  • Shiva
  • , Updated On : August 30, 2023 / 08:37 AM IST

    Vaishnavi Chaitanya

    Follow us on

    Vaishnavi Chaitanya: ఈ ఏడాదికి బేబీ మూవీ ఒక సెన్సేషన్. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దర్శకుడు సాయి రాజేష్ ట్రైయాంగిల్ లవ్ డ్రామాగా తెరకెక్కించాడు. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ని బోల్డ్ అండ్ నెగిటివ్ షేడ్స్ తో తీర్చిదిద్దాడు. అది సినిమాకు ప్లస్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ ప్రధాన పాత్రలు చేశారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య చేసిన పాత్రకు ప్రశంసలు దక్కాయి. బేబీ మూవీతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

    థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన బేబీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా బేబీ ఓటీటీ హక్కులు దక్కించుకుంది. ఆగస్ట్ 25 నుండి బేబీ స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో కూడా బేబీ చిత్రానికి అద్భుత రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఆహా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. వాట్సప్ బేబీ అంటూ వైష్ణవి చైతన్యతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.

    వాట్సప్ బేబీలో వైష్ణవి చైతన్యను కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడగడమైంది. అందులో మొదటిగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ లలో ఎవరిని పెళ్లి చేసుకుంటారని అడగ్గా… ఇద్దరినీ కాదని సమాధానం చెప్పింది. ఒక్కొక్కరిలో ఒక్కో మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పింది. బేబీ మూవీలో వైష్ణవి చేసింది కరెక్టేనా? అని అడగ్గా… కరెక్టే అని చెప్పింది. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని పరిమితులు ఉండ కూడదు. పరిస్థితులను బట్టి నడుచుకోవాలే. కాబట్టి బేబీలో వైష్ణవి చేసింది కరెక్టే అని చెప్పింది.

    బేబీలో వైష్ణవి పాత్ర మీకు నచ్చిందా అనగా… ఎస్ నాకు బాగా నచ్చిందని సమాధానం చెప్పింది. వైష్ణవి చైతన్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. బేబీ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో మూడు సినిమాల్లో నీకు ఛాన్స్ ఇస్తానని దర్శకుడు సాయి రాజేష్ వైష్ణవి చైతన్యకు ప్రామిస్ చేశాడట.