Star Heroine: కవ్వించే రూపం, ఆకట్టుకునే నటన ఈ బ్యూటీ సొంతం. తన టాలెంట్ తో చాలామంది అభిమానులను ఈ ముద్దుగుమ్మ సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కానీ హీరోయిన్ గా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈమె తెలుగులో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటారు. ఇలా అందం తో, నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఈ ముద్దుగుమ్మ కూడా తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత టాలీవుడ్ కు దూరం అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో మాత్రమే నటించి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన భామలు చాలామంది ఉన్నారు. తెలుగులో కేవలం వీళ్లు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొను లేదా అవకాశాలు రాక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ హీరోయిన్ కూడా తెలుగులో రెండు సినిమాలలో మాత్రమే నటించింది. ఆ రెండు సినిమాలలో ఒకటి బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందింది. మరొక సినిమా సంచలన విజయం సాధించింది. కానీ ఈ అమ్మడికి తెలుగులో మాత్రం ఆఫర్స్ రాలేదు.
View this post on Instagram
ప్రస్తుతం ఈ చిన్నది ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు పారితోషకం అందుకుంటుంది. ఈ చిన్నదాని ఆస్తిపాస్తులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఆమెను మించిన హాట్ బ్యూటీ ఎవరూ లేరు. ఈమె అందంలో అప్సరస. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే చేసింది. అందులో ఒకటి పరాజయం పొందితే మరొకటి సూపర్ హిట్ అయ్యింది. ఈ బ్యూటీ మరెవరో కాదు దిశా పటాని. దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో లోఫర్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు జంప్ అయ్యి అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఆ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక లేటెస్ట్ గా దిశా పటాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో కూడా నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంచలన విజయం సాధించి ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాగే చివరిగా దిశాపటాని కంగువ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.