https://oktelugu.com/

Srirapaka : పూరి జగన్నాధ్ తనపైకి ఎక్కి అలా చేయమన్నాడు, మా మధ్య బంధం ఏర్పడింది.. వర్మ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

దర్శకుడు పూరి జగన్నాధ్ ని ఉద్దేశిస్తూ వర్మ హీరోయిన్ శ్రీరాపాక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేలపై పడుకుని ఉన్న పూరి జగన్నాధ్ తన పైకి ఎక్కి తొక్కమన్నాడని ఆమె అన్నారు. తమ మధ్య బంధం ఏర్పడినట్లు వెల్లడించింది. ఇంతకీ పూరి జగన్నాధ్ తో ఆమెకు ఎలా పరిచయమైంది? ఆ కథేమిటీ?

Written By:
  • S Reddy
  • , Updated On : September 19, 2024 / 11:55 AM IST

    Srirapaka comments Viral

    Follow us on

    Srirapaka : ఒక్క సినిమాతో టాలీవుడ్ లో పిచ్చ పాపులారిటీ రాబట్టింది శ్రీరాపాక. ఈ తెలుగు అమ్మాయి నగ్నం మూవీలో బోల్డ్ రోల్ చేసి వార్తలకు ఎక్కింది. నగ్నం మూవీ ట్రైలర్స్ దర్శకుడు వర్మ దారుణంగా కట్ చేశాడు. రాయలేని భాషలో కెమెరా యాంగిల్స్ పెట్టి శ్రీరాపాక గ్లామర్ ని తెరపై ఆవిష్కరించాడు. నగ్నం మూవీ ప్రోమోలు చూసిన జనాలు… ఎవరీ శ్రీరాపాక అని సెర్చ్ చేశారు. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

    శ్రీరాపాక వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అని సమాచారం. దర్శకుడు వర్మ ఆమెకు నటిగా అవకాశం ఇచ్చాడు. అయితే కాలేజీలో చదువుకునే రోజుల్లోనే దర్శకుడు పూరి జగన్నాధ్ తో శ్రీరాపాకకు పరిచయం ఉందట వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తాజాగా ఆమె బయటపెట్టారు.

    చదువుకునే రోజుల్లో శ్రీరాపాక తన కాలేజీకి వెళ్లే దారిలో పూరి జగన్నాధ్ ఆఫీస్ ఉందట. సినిమాపై ఉన్న మక్కువతో ఆయన ఆఫీస్ కి రోజూ వెళ్లేదట. ఆ విధంగా పూరి జగన్నాధ్ తో పరిచయం ఏర్పడిందట. ఒకరోజు శ్రీరాపాక ఆఫీస్ కి వెళ్లే సమయానికి పూరి జగన్నాధ్ నేలపై పడుకుని ఉన్నాడట. ఇంత పెద్ద దర్శకుడు నేలపై పడుకున్నాడేంటని.. ఆమె ఆశ్చర్యానికి గురైందట. వచ్చి నా కాళ్ళ పై ఎక్కు అని పూరి జగన్నాధ్ కోరాడట. శ్రీరాపాక అయన కాళ్ళ పై నిల్చొని మసాజ్ చేసిందట.

    అప్పటి నుండి పూరి జగన్నాధ్ తో బంధం ఏర్పడిందట. బంధం అంటే చెడు సంబంధం కాదు. మంచి స్నేహం, అని శ్రీరాపాక చెప్పుకొచ్చింది. మహేష్ తో కూడా ఆమెకు చిన్న పరిచయం ఉందట. పోకిరి మూవీ సమయంలో పూరి జగన్నాధ్ ఆఫీస్ కి మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ వంటి నటులు వచ్చేవారట. మహేష్ బాబు తనని చూసి ఎవరీ పిల్ల బచ్చా.. అనేవాడట. ఈ విషయాలు చెప్పి శ్రీరాపాక మురిసిపోయింది.

    శ్రీరాపాక బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్ చేసిన సంగతి తెలిసింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో హాట్ స్టార్ లో ఇది ప్రసారమైంది. శ్రీరాపాక పెద్దగా రాణించలేదు. కొద్దిరోజులకే ఆమె జర్నీ ముగిసింది.