https://oktelugu.com/

Sree Leela: ఆ హీరోయిన్ కోసం ఎగబడుతున్నారు.. అక్కడ కూడా దుకాణం తెరిచింది

Sree Leela: సినిమాల్లో అదృష్టం కలిసొస్తే వరుసపెట్టి అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం అదృష్టం అంతా శ్రీ లీల దగ్గరే ఉన్నట్టు ఉంది. తమిళ, కన్నడ పరిశ్రమల్లో కూడా శ్రీ లీల కోసం మేకర్స్ ఎగబడుతున్నారు. ఇన్ని ఇండస్ట్రీల్లో ఒకేసారి ఎంట్రీ దక్కడం అంటే అదృష్టం ఉండాలి. ప్రస్తుతం అలాంటి అదృష్టాన్నే ఎంజాయ్ చేస్తోంది శ్రీ లీల. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు చాలామంది హీరోయిన్లు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఛాన్స్ లు రావు. ఛాన్స్ లు వచ్చినా.. […]

Written By:
  • Shiva
  • , Updated On : July 8, 2022 / 03:25 PM IST
    Follow us on

    Sree Leela: సినిమాల్లో అదృష్టం కలిసొస్తే వరుసపెట్టి అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం అదృష్టం అంతా శ్రీ లీల దగ్గరే ఉన్నట్టు ఉంది. తమిళ, కన్నడ పరిశ్రమల్లో కూడా శ్రీ లీల కోసం మేకర్స్ ఎగబడుతున్నారు. ఇన్ని ఇండస్ట్రీల్లో ఒకేసారి ఎంట్రీ దక్కడం అంటే అదృష్టం ఉండాలి. ప్రస్తుతం అలాంటి అదృష్టాన్నే ఎంజాయ్ చేస్తోంది శ్రీ లీల. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు చాలామంది హీరోయిన్లు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఛాన్స్ లు రావు. ఛాన్స్ లు వచ్చినా.. ఎక్కువ కాలం నిలబడలేరు.

    Sree Leela

    కానీ, శ్రీ లీల మాత్రం అప్రయత్నంగానే కన్నడనాట, తమిళనాట ఎంట్రీ ఇస్తోంది. తాజాగా శ్రీ లీల తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. “తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీపై నేను చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాను. నా మొదటి సినిమా టైమ్ నుంచి కోలీవుడ్ లో నాకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా నాకు తమిళ ప్రేక్షకుల నుంచి కూడా గొప్ప ప్రశంసలు రావడం నా అదృష్టం’ అంటూ శ్రీ లీల చెప్పుకొచ్చింది.

    Also Read: Happy Birthday Movie Review: రివ్యూ – హ్యాపీ బర్త్ డే

    శ్రీ లీల ఇంకా మాట్లాడుతూ.. ‘అప్పుడు నేను ఊహించలేదు. తమిళంలో కూడా నా పై అంత ప్రేమ చూపిస్తారని! అనుకోకుండా తమిళ్ లో నేను హీరోయిన్ గా అడుగుపెడుతున్నాను. సూర్య గారి సినిమాలో నేను హీరోయిన్ గా చేయడం నా లక్. ఇది తెలుగు – తమిళ్ బైలింగ్వెల్ మూవీ. దీంతో ఇక తమిళ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీ లీల తమిళం నేర్చుకుంటుందా ? అంటూ నా ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు.

    Sree Leela

    కానీ.. నేను శ్రీ లీల, తమిళం నేర్చుకున్నాను. ప్రస్తుతానికైతే తమిళ్ నేర్చుకుంటున్నప్పటికీ.. డబ్బింగ్ మాత్రం నేను చెప్పడం లేదు. కానీ భవిష్యత్తులో చెబుతాను అంటూ తెలిపింది శ్రీ లీల. ఇలా వరుసపెట్టి తమిళ సినిమాలు చేస్తోంది శ్రీ లీల. ఇవన్నీ తను ప్లాన్ చేయలేదని, అలా జరిగిపోయాయని చెబుతోంది శ్రీ లీల.

    మొత్తమ్మీద శ్రీ లీల కోసం తెలుగులో ఎగబడుతున్నారు. ఇప్పుడు తమిళంలో కూడా దుకాణం తెరిచింది. కాబట్టి అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. !
    ఇక డాన్సుల్లో శ్రీ‌లీల‌ ఈజ్ చూస్తే కచ్చితంగా కుర్రాళ్ళ మ‌తి పోగొట్టేలా ఉంది. ఇప్పటికే ర‌వితేజ సినిమాలో శ్రీ‌లీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆమె ఖాతాలో మరికొన్ని సినిమాలు వచ్చినట్టు తెలుస్తోంది. శ‌ర్వా, నితిన్‌ సినిమాల్లో కూడా ఆమెకు అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి.

    Also Read: Lavanya Tripathi Assets: లావణ్య త్రిపాఠి ఆస్తులెన్నో తెలుసా..? ఆమె అపార్ట్మెంట్ అంత అంత ఖరీదా ?

    Tags