Shalini Pandey: హీరోయిన్ షాలిని పాండే.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షాలిని తన తొలి సినిమాతోనే కుర్రాళ్లను ఫిదా చేసింది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. కానీ, స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అయితే, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన షాలిని పాండే, హీరోయిన్ గా బాగానే ఎదిగింది.

నిజానికి షాలిని పాండే గొప్ప అందగత్తె కాదు, పైగా కాస్త పొట్టిగా ఉంటుంది. అదృష్టం బాగుండి.. మొదటి రెండు సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే ఆమె కెరీర్ టర్న్ అయింది. అయితే, వచ్చిన క్రేజ్ ను, ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకోవడంలో సంపూర్ణంగా విఫలం అయింది షాలిని పాండే. పైగా సినిమాల ఎంపికలో కూడా అనేక పొరపాట్లు చేసింది.
Also Read: The Warrior Collections: ‘ది వారియర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
ఓ దశలో షాలిని పాండే డేట్లు కోసం చిన్న నిర్మాతలు పరి తప్పించారు. అలాంటి డిమాండ్ ను కూడా సరిగ్గా వాడుకోలేకపోయింది ఈ స్మాల్ బ్యూటీ. చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేసింది, చివరకు ప్లాప్ ల వలయంలో షాలిని పాండే పూర్తిగా చిక్కుకుంది. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. కరోనాకి ముందు ఏడాది వరకూ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.

ఆ సమయంలోనే ఈ క్యూట్ బ్యూటీ కొంచెం ట్రాక్ తప్పిందని టాక్ ఉంది. ఓ చిన్న నిర్మాతతో ఏర్పడిన పరిచయం కారణంగా ఆమె కొన్ని ప్రత్యేక నైట్ పార్టీలను ఒప్పుకుందని, ఆ పార్టీల కారణంగానే వచ్చే ఛాన్స్ లను కూడా కోల్పోయిందట. మొత్తానికి రియలైజ్ అయ్యింది. అందుకే, ఎలాగైనా హీరోయిన్ గా మళ్ళీ బిజీ కావడానికి కసరత్తులు చేస్తోంది షాలిని.
షాలిని పాండేకు మంచి పరిచయాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిచయాలను వాడుకుని అందరికీ ఫోన్ చేసి ఛాన్స్ లు అడుగుతుంది. అర్ధాంతరంగా కిందకి పడిపోయిన తన కెరీర్ ను మళ్ళీ నిలబెట్టుకోవడానికి షాలిని పాండే బాగానే కష్టపడుతుంది. మరి షాలిని మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవాలని కోరుకుందాం.
[…] […]