Heroine Saloni: సినిమాల్లో నటించే కొందరు హీరోయిన్ల ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంటారు. దీంతో ఆ తరువాత వీరు స్టార్లుగా మారిపోతారని అనుకుంటారు. కానీ అదృష్టం కొద్దీ వారు ఎన్ని సినిమాల్లో నటించినా రాణించలేకపోతారు. అలా ప్రయత్నాలు చేసి.. చేసి… చివరికీ ఇండస్ట్రీని వదులుకున్నారు. అలాంటి హీరోయిన్లలో సలోని అశ్విన్ ఒకరు. ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ స్టార్ గా రాణించలేకపోయింది. అయితే సలోని లేటేస్ట్ పిక్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. పూర్తిగా గుర్తుపట్టలేకుండా ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.
సలోని బాలీవుడ్ నుంచి దిగిన బ్యూటీ. మొదట్లో ఆమె హిందీ సినిమాల్లో నటించింది. మహారాష్ట్రకు చెందిన ఈమె 2003లో ‘దిల్ పరదేశి’ అనే హిందీ సినిమాలో నటించింది. తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన ‘ధన 51’ అనే సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే మెగా హీరో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’లో ప్రత్యేక పాత్రలో నటించిన సలోనికి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత రాజమౌళి ఆమెకు ‘మర్యాద రామన్న’ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.
ఈ సినిమా సక్సెస్ కావడంతో సలోనికి మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. చివరిగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే సినిమాలో నటించింది. అయితే ఇందులో కమెడియన్ పృధ్వీరాజ్ పక్కన నటించినా ఆమె నటనకు ప్రేక్షకులు పిదా అయ్యారు. ఆ తరువాత సలోనిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో జీవిస్తోంది.
సలోని లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తెలుగు సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లా తయారైంది. పూర్తిగా హాట్ ఫోజులతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఇంతకాలం కామ్ గా ఉన్న సలోని ఒక్కాసారిగా సోషల్ మీడియాలో మెరవడంతో ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందని అంతా అంటున్నారు. కానీ ఆమెకు అవకాశం ఇచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి.