https://oktelugu.com/

Heroine Sadha: డైరెక్టర్ తేజా బలవంతంగా నాతో ఆ పని చేయించాడు, ఇంటికెళ్లి ఏడ్చాను… సదా కీలక ఆరోపణలు

నితిన్ ని చికబాదుతూ సదాను వేదనకు గురి చేస్తాడు. ఈ సీన్లో గోపీచంద్ ఇది నాకు కాబోయే పెళ్ళాం అంటూ... నాలుకతో బుగ్గ నాకుతాడు. చూడటానికి కొంచెం జుగుప్సాకరంగా ఆ సీన్ ఉంటుంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 20, 2023 / 10:51 AM IST

    Heroine Sadha

    Follow us on

    Heroine Sadha: హీరోయిన్ గా రిటైర్ అయిన సదా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అహింస చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బుల్లితెర డాన్స్ రియాలిటీ షోలలో సదా జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా దర్శకుడు తేజాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. సదా డెబ్యూ మూవీ జయం. తేజాకు అది మూడో చిత్రం. 2002లో విడుదలైన జయం ఆల్ టైం బ్లాక్ బస్టర్. వందల రోజులు థియేటర్స్ లో ఆడింది. నితిన్ కూడా ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా ఫెయిల్ అయిన గోపీచంద్ విలన్ గా టర్న్ తీసుకున్న చిత్రం అది.

    ఈ సినిమాలో హీరో నితిన్ ని సదా రహస్యంగా గుడి వెనుక కలుస్తుంది. వీళ్ళ ప్లాన్ ముందుగానే పసిగట్టిన విలన్ గోపీచంద్ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. నితిన్ ని చికబాదుతూ సదాను వేదనకు గురి చేస్తాడు. ఈ సీన్లో గోపీచంద్ ఇది నాకు కాబోయే పెళ్ళాం అంటూ… నాలుకతో బుగ్గ నాకుతాడు. చూడటానికి కొంచెం జుగుప్సాకరంగా ఆ సీన్ ఉంటుంది. కాగా సదా అందుకు ఒప్పుకోలేదట. తాను ఆ సన్నివేశం చేయనని ముందుగానే చెప్పిందట. షూటింగ్ సమయంలో మాత్రం చేయాల్సిందే, ఇది సినిమాకు హైలెట్ అవుతుందన్నాడట.

    చివరికి గోపీచంద్ వదిలేయండి సార్… అన్నా వినలేదట. పైగా గోపీచంద్ మీద కోప్పడ్డాట తేజ. డెబ్యూ మూవీ కావడంతో సదాకు తప్పలేదు. ఆ సీన్ ఎందుకు చేశానా అని ఇప్పటికీ బాధపడతాను. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. ముఖాన్ని పదే పదే కడుక్కున్నాను. ఇప్పుడు కూడా ఆ సీన్ టీవీలో వస్తే ఆ దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోతాను… అని సదా చెప్పారు.

    తనకు భారీ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు, సినిమా గురించి సదా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జయం సినిమా సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా తేజాతోనే మొదలైంది. ఇటీవల విడుదలైన అహింస చిత్రంలో సదా కీలక రోల్ చేసింది. సినిమా మాత్రం ఆడలేదు. ఇక పెళ్లి చేసుకోను అంటుంది సదా. సింగిల్ గా జీవితం సో హ్యాపీ అంటుంది.