Also Read: కేకలు పెట్టిన పాయల్ రాజ్‌పుత్..
‘ఉదయం లేవగానే ముందుగా నీళ్లు తాగుత. దాదాపు లీటరు నీళ్లు గడగడా తాగేస్తుంట. ఈ మధ్యే నా డైటీషియన్ నీళ్లతోపాటు కాస్త యాపిల్ సిడర్ వెనిగర్ తాగమని సలహా ఇచ్చింది. నాకు అవకాడో టోస్ట్ అంటే చాలా ఇష్టం. కానీ నా డైటీషియన్ తినొద్దని చెప్పింది. అందుకే మానేశా. ఆమె ఏం చెబితే అదే నా బ్రేక్ ఫాస్ట్. ఒక బౌల్ నిండుగా రకరకాల పండ్ల ముక్కలు తింటా. బొప్పాయి, అరటి పండు, యాపిల్, నల్ల ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ గింజలు, ఫిగ్ పండ్లు ఇవన్నీ నా ఫ్రూట్ బౌల్‌లో కనిపిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
వాటితోపాటు.. అన్నం ఎక్కువ తినదట. ఒక కప్పులో కూరలన్నీ కలిపి తింటదట. అలా అయితే ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు తిన్నట్లు అవుతుందని ఆమె ఫీల్. డిన్నర్‌లో చాలా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటానని.. రైస్ మాత్రం ముట్టనని చెప్పింది. ‘నిజానికి నేను పక్కా మాంసాహారిని కానీ ఏడాది క్రితం శాకాహారిగా మారా. చికెన్ వంటకాలంటే పడి చచ్చే నేను మానేశానంటే అది అందం కాపాడుకునేందుకే. నాజూగ్గా కనిపించాలనే నాన్ వెజ్ మానేశా. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తింటున్నా. వీటికితోడు ఉడకబెట్టిన గుడ్లు బాగా తింటా. వ్యాయామం చేశాక కచ్చితంగా రెండు గుడ్లు తినాల్సిందే. అందుకే నేను ఎగ్ టేరియన్ని అని చెబుతా’ అని అంటోంది.
Also Read: సంచలన సీక్రెట్ చెప్పిన హీరోయిన్ రష్మిక మందన్న
టొమాటోలు, క్యాప్సికం, కీరాదోస, బంగాళాదుంపలు అంటే అలర్జీ అని చెబుతున్న రష్మిక మందన్న.. ఐస్ క్రీములు, చాకొలెట్ కేకులంటే చాలా ఇష్టమని చెబుతోంది. అప్పుడప్పుడు డైటీషియన్ అనుమతితో తింటానంటోంది.