Rashmika Mandanna : బాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక(Rashmika Mandana) ని స్టార్ హీరోయిన్ లీగ్ లో నిలబెట్టిన చిత్రం ‘యానిమల్’. సందీప్ వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా బాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియా లో కూడా ఒక సెన్సేషన్. నెట్ ఫ్లిక్స్ లో కూడా అత్యధిక వారాలు ట్రెండ్ అయిన ఇండియన్ సినిమాలలో ఒకటి గా ‘యానిమల్'(Animal Movie) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు వెర్షన్ నుండి కూడా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో రష్మిక ఆహరం విషయం లో చాలా ఇబ్బందులు ఎదురుకుందట. ఒక రోజు నిర్మాతకు ఫుడ్ అసలు బాగాలేదని, ఇలాంటివి తింటే నా ఆరోగ్యం పాడు అవుతుందని కంప్లైంట్ ఇచ్చిందట. ఈ విషయం ఎవరి ద్వారానో హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కి తెలిసింది.
పక్క రోజు ఆయన షూటింగ్ కి వచ్చేటప్పుడు రష్మిక కోసం స్పెషల్ గా తన ఇంటి నుండి వంటకాలను తెచ్చాడట. తన వంటవాడితో రష్మిక కోసం స్పెషల్ గా ఆమెకి ఏ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇష్టం ఉందో, ఆ ఫుడ్ ఐటమ్స్ ని దగ్గరుండి మరీ చేయించాడట. రణబీర్ కపూర్ చూపించిన ఈ ప్రేమకు రష్మిక కరిగిపోయిందట. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోయాయట. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది రష్మిక. రణబీర్ కపూర్ తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని, తన సెట్స్ లో పని చేసే ప్రతీ ఒక్కరితో రణబీర్ చాలా స్నేహం గా ఉంటాడని, ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇకపోతే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ రేంజ్ లో చక్రం తిప్పుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్ ఇలా టాప్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఈమె దెబ్బకు విలవిలలాడి పోతున్నారు. కేవలం ఒక్క భారీ హిట్ అయితే అనుకోవచ్చు, కానీ ఈమె అక్కడ వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది. అందులో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాలు రెండు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రం కూడా త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి దగ్గరగా వెళ్లనుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ తో కలిసి ‘సికందర్’ అనే చిత్రం చేస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.