https://oktelugu.com/

Rakul Preet Singh : నాకు ఎలాంటి రాజకీయ నాయకుడితో సంబంధం లేదు..దయచేసి నన్ను వదిలేయండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఒక పాపులర్ లీడర్ కి రిలేషన్ లింక్ చేస్తూ అత్యంత నీచమైన కామెంట్స్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా రోజుల నుండి ఈ రూమర్ ప్రచారంలోనే ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 / 08:47 PM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh : ఈమధ్య కాలం లో కొంతమంది రాజకీయ నాయకులూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పని చేసేవారిని సాఫ్ట్ టార్గెట్ చేయడం అలవాటుగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల పై విమర్శలు చేసే క్రమం లో మన టాలీవుడ్ లో పని చేసే హీరో, హీరోయిన్స్ ని లాగి అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా మంత్రి స్థాయిలో కూర్చున్న కొండా సురేఖ నాగార్జున కుటుంబం పై, సమంత పై చేసిన అనుచిత ఆరోపణలు, వినేందుకు ఎంత అసహ్యంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీనిపై సినీ పరిశ్రమ మొత్తం స్పందించి కొండా సురేఖ కామెంట్స్ ని తీవ్రంగా తప్పుబట్టారు.

    దీనిపై కొండా సురేఖ కూడా స్పందించి సమంత కి మీడియా ముందు బహిరంగంగా క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. కానీ నాగార్జున కుటుంబానికి మాత్రం ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీనిపై కూడా ఆమె తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఒక పాపులర్ లీడర్ కి రిలేషన్ లింక్ చేస్తూ అత్యంత నీచమైన కామెంట్స్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా రోజుల నుండి ఈ రూమర్ ప్రచారంలోనే ఉంది.

    అంతెందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్షం లో ఉన్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని ప్రముఖ నాయకుడికి లింక్ చేస్తే అనేక కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం సందర్భం వచ్చింది కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ తనదైన శైలిలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘ తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభ ని ప్రపంచం మొత్తం గుర్తిస్తున్న ఈ సమయం, నేను కూడా ఈ పరిశ్రమలో భాగం అయ్యినందుకు ఎంతో గర్వం గా ఉంది. నా ప్రయాణం ఈ పరిశ్రమలో ఎంతో సంతృప్తిని ఇచ్చింది, ఇప్పటికీ నేను ఈ పరిశ్రమకి చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. అయితే కొన్ని నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు ఇండస్ట్రీ లో పని చేస్తున్న స్త్రీలపై వ్యాప్తి చెందడం బాధాకరం. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే బాధ్యత గల స్థానం లో కూర్చున్న మహిళా మరో మహిళా పై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తుంది. మేము గౌరారం కోసం మౌనం గా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం, దానిని మా బలహీనతగా భావిస్తున్నారు. నాపైన కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. నేను రాజకీయాలకు కానీ పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని. అదే విధంగా ఏ రాజకీయ నాయకుడితో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ రాజకీయ మైలేజి కోసం నా పేరుని ఇంతటి దారుణమైన రీతిలో ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఒకే ట్వీట్ లో ఆమె సమంత, నాగార్జున కుటుంబం పై వచ్చిన ఆరోపణలను, అలాగే చాలా కాలం నుండి తన పేరు మీద నడుస్తున్న రూమర్స్ కి సమాధానం చెప్పేసింది.