Raashii Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నటి రాశీఖన్నా. ఈ అమ్మాయి ఎవరు కొంచెం బొద్దుగా ఉంది అని అందరు అనుకునేలోపే, తన తర్వాత చిత్రాలలో బాగా బరువు తగ్గి తను గ్లామరస్ రోల్స్ కూడా చేయగలను అని నిరూపించుకుంది. సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన కంటూ అభిమానుల్ని ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ హీరోయిన్ రాశీఖన్నా తన కెరియర్ లో చాలా సినిమాలని మిస్ చేసుకున్నంట. మరి ఆ చిత్రాలు ఏమో చూద్దాం.
బాహుబలి
బాహుబలి తమన్నా క్యారెక్టర్ కి రాశీఖన్నా ముందుగా అడిషన్ ఇచ్చారట. కానీ అడిషన్ లో చూసిన తరువాత రాజమౌళి, రాశీఖన్నా సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సూట్ కాదని భావించి, ఆమెను ఊహలు గుసగుసలాడే సినిమాకు రికమెండ్ చేశారంట.
సర్కారు వారి పాట
జూనియర్ ఎన్టీఆర్ ని తప్పిస్తే, రాశీఖన్నా ఎక్కువగా టైర్ 2 హీరోలతోనే నటించింది. కానీ రాశి కి సర్కారు వారి పాట సినిమా లో మహేష్ బాబు తో నటించే చాన్స్ ఇద్దాం అనుకున్నారు అంతా దర్శకుడు పరశురామ్. కానీ పెద్ద హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఆ చిత్ర నిర్మాతలు అనడంతో పరశురామ్ తన నిర్ణయాన్ని మార్చుకుని కీర్తి సురేష్ కి ఇచ్చారు.
మానాడు
సింధు హీరోగా వచ్చిన ఈ చిత్రం తమిళంలో మంచి హిట్ గా నిలిచింది. అంతే కాక తెలుగులో కూడా ఓటిటి లో రిలీజ్ అయి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ చిత్రంలో ముందుగా రాశీ ఖన్నా నే హీరోయిన్ గా అనుకున్నారు, కానీ ఆ తరువాత ఎందుకో తెలియదు కానీ ఆ ఛాన్స్ కళ్యాణి ప్రియదర్శన్ కి వెళ్ళింది
ఎఫ్ 2
ఎఫ్ 2 సినిమా లో హనీ క్యారెక్టర్ మన అందరికీ గుర్తుండిపోయే పాత్ర. ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి ముందుగా రాశీ ఖన్నాని అడిగారంట కానీ రాశీ నో చెప్పడంతో ఆ పాత్ర మెహరీన్ కి వెళ్ళింది.
గీత గోవిందం
రష్మిక మందాన ని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన చిత్రం గీత గోవిందం. మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ వచ్చిన రాశి ఒప్పుకోలేదట. దానికి కారణం ఈ సినిమా కోసం పరశురామ్ రాశిని అడిగినప్పటికీ ఇంకా అర్జున్ రెడ్డి సినిమా విడుదల అవ్వక పోవడం తో విజయ్ దేవరకొండ కి అంత క్రేజ్ లేదని ఈ చిత్రాన్ని తిరస్కరించిందంట.
ఇవే కాకుండా రాశీ ఖన్నా తన కెరీర్లో ఇంకా ఎన్నో సినిమాలని వదులుకుంది అని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాలు అన్ని రాశీ ఖన్నా చేసి ఉంటే టాలీవుడ్ లో ఆమె పొజిషన్ వేరుగా ఉండేదేమో.