Raashi Khanna: అందం, టాలెంట్, డ్యాన్స్ ఇలా అన్ని యాంగిల్స్ లో పర్ఫెక్ట్ గా ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీ లో దొరకడం చాలా అరుదు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రాశీ ఖన్నా(Rashi Khanna). ఈమెకు పైన చెప్పిన లక్షణాలు మాత్రమే కాకుండా, మంచి కామెడీ టైమింగ్ ఉంది, అదే విధంగా విలన్ క్యారెక్టర్స్ అద్భుతంగా చేయగల సత్తా కూడా ఉంది. ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న కంటెస్టెంట్స్ అందరూ అత్యధిక శాతం అందాలను ఆరబోయడమే కానీ, ఒక్కరిలో కూడా సరైన టాలెంట్ లేదు అనే భావన కలుగుతోంది ఆడియన్స్ కి. అలాంటి హీరోయిన్స్ తో పోలిస్తే రాశీ ఖన్నా వెయ్యి రెట్లు బెటర్ అనేది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఆమెకు ఎందుకో అదృష్టం మాత్రం పాపం కలిసి రాలేదు. కేవలం మీడియం రేంజ్ హీరోయిన్ స్థాయికి పరిమితం అయ్యింది.
ఎన్టీఆర్ లాంటి స్టార్ తో జై లవకుశ చిత్రం చేసింది. ఇది ఆమె కెరీర్ కి బాగా ఉపయోగపడుతుందని అంతా అనుకున్నారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది, కానీ రాశీ ఖన్నా కెరీర్ కి ఆ చిత్రం ఎలాంటి బూస్ట్ ని కూడా ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ మీడియం రేంజ్ హీరోల సినిమాలు చేసుకుంటూ వస్తూ, మీడియం రేంజ్ హీరోయిన్ గానే స్థిరపడిపోయింది. మధ్యలో బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, అవి పెద్దగా సక్సెస్ కాకపోవడం తో రాశీ ఖన్నా కి గొప్ప పేరేమి రాలేదు. ఇక లేటెస్ట్ గా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా రాశీ ఖన్నా కి ఎలాంటి ఉపయోగం లేదు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఒక బ్రాడ్ క్యాస్ట్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాశీ ఖన్నా చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అవేంటో ఒకసారి చూద్దాం. ‘మీకు ఒక అభిమాని తో డేటింగ్ చేసే అవకాశం వస్తే చేస్తారా లేదా?’ అని అడిగిన ప్రశ్నకు రాశీ ఖన్నా సమాధానం చెప్తూ ‘నాకు అలాంటి ఉద్దేశ్యాలు లేవు. వాళ్ళు మమ్మల్ని అభిమానించి ఒక పెద్ద పీఠం మీద కూర్చోబెట్టారు. మనల్ని వాళ్ళు దూరం నుండి చూసినప్పుడు ఒకలాగా, దగ్గర నుండి చూసినప్పుడు మరోలాగా అనిపిస్తాము. కాబట్టి ఏ అభిమానం అయినా దూరం నుండే బాగుంటుందని నా అభిప్రాయం. అదే ఒక అభిమానికి మంచిది అని నేను భావిస్తాను’ అంటూ చాలా బోల్డ్ గా సమాధానం ఇచ్చింది రాశీ ఖన్నా.