Bigg Boss 9 Telugu: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హిస్టరీ లో హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి రెండవ వారం లో తప్ప, అసలు నామినేషన్స్ లోకి రాని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇమ్మానుయేల్. సీజన్ 7 లో ఆట సందీప్ అద్భుతంగా గేమ్స్ ఆడుతూ వచ్చినప్పటికీ కూడా 6వ వారం లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కారణం మొదటి వారం నుండి ఆయన నామినేషన్స్ లోకి రాకపోవడమే. ఇప్పుడు ఇమ్మానుయేల్ పరిస్థితి కూడా ఇదేనేమో, ఈ వారం అతను డేంజర్ జోన్ లోకి వస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. ఈ వారం నామినేషన్స్ లోకి ఇమ్మానుయేల్ రాగా, ప్రస్తుతం టైటిల్ రేస్ లో పోటీ పడుతున్న పవన్ కళ్యాణ్ తో సరిసమానమైన ఓటింగ్ పడుతోంది. మిస్సెడ్ కాల్స్ లో అయితే ఇమ్మానుయేల్ నే టాప్ అని అంటున్నారు. బిగ్ బాస్ టీం కూడా ఇమ్మానుయేల్ మాస్ చూసి నోరెళ్లబెట్టారట.
ఆయన సత్తా చూసి టైటిల్ రేస్ లో నిలిచే అవకాశాలు ఇమ్మానుయేల్ కి కూడా ఉన్నాయని గ్రహించారట. కానీ ఉన్న ఈ నాలుగు వారాలు అయినా కచ్చితంగా నామినేషన్స్ లోకి రావాలి, లేదంటే టాప్ 3 స్థానం తోనే సరిపెట్టుకోవాలి. నిన్నటి ఎపిసోడ్ ఆరంభం లో ఇమ్మానుయేల్ తల్లి హౌస్ లోకి రావడం, అందరితో సరదాగా మాట్లాడి వెళ్లడం వంటివి చేసిన సంగతి మనకు తెలిసిందే. హౌస్ నుండి వెళ్లే ముందు ఆమె కంటెస్టెంట్స్ కి ‘మా ఇమ్మానుయేల్ ని దయచేసి నామినేట్ చేయండి’ అంటూ చెప్పడం హైలైట్ గా నిల్చింది. అంటే ఆమెకు కూడా నామినేషన్స్ లోకి రాకపోతే ఎంత నష్టమో తెలుసు అన్నమాట. ఇన్ని రకాల హింట్స్ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇమ్మానుయేల్ తల్లి గురించి మాట్లాడాల్సి వస్తే, ఆమె మాట తీరుని చూసి ప్రతీ ఒక్క సామాన్యుడు కనెక్ట్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఇమ్మానుయేల్ తో మాట్లాడిన ప్రతీ మాట ఆడియన్స్ చేత కంటతడి పెట్టించేలా చేసింది. ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఇమ్మానుయేల్ ని చూసి అందరూ గర్వపడేలా చేసింది. అయితే ఈమెకు ఎందుకో సంజన నచ్చలేదు అని చూసే ఆడియన్స్ కి అనిపించింది. అంతే కాకుండా డిమోన్ పవన్,పవన్ కళ్యాణ్ లు ఈమెకు బాగా నచ్చారు. ఇక తనూజ ని అయితే అమ్మాయిలు కూడా అసూయ పడేంత అందం నీ సొంతం అంటూ చెప్పుకొచ్చింది. భరణి అయితే బాగా ఆడుతున్నాడు కానీ, ఈమధ్య ఆయనకు ఆరోగ్యం బాగలేదు కదా, కాస్త తగ్గాడు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇలా అందరి గురించి చాలా మంచిగా మాట్లాడింది.