DeviSri Prasad : దేవీ శ్రీప్రసాద్ పెళ్లి గురించి ఎప్పుడో ఒకప్పుడు రూమర్ వస్తూనే ఉంటుంది. అప్పట్లో హీరోయిన్ చార్మిని పెళ్లి చేసుకున్నాడని కోడై కూసింది. ఆ తర్వాత ఓ గాయని మెడలో మూడు ముళ్లు వేశాడని ప్రచారం చేశారు. అయినా అంత పెద్ద సెలబ్రెటీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్.. అంత సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంటాడన్నది ప్రశ్న. ఆ విషయంలో కనీసం సృహ లేకుండా రాసేస్తున్నారు.

తాజాగా మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ కు పెళ్లి చేసేశారు. ఈసారి పెళ్లి అయ్యింది అందమైన అచ్చ తెలుగు హీరోయిన్ తో.. ఆమె పేరు పూజిత పొన్నాడ.. విశాఖకు చెందిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున-కార్తి నటించిన ‘ఊపిరి ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇటీవలే ‘ఆకాశ వీధుల్లో’, ఓదెల రైల్వే స్టేషన్ లో నటించింది. దాదాపు 10 వరకూ చిత్రాల్లో నటించి కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటోంది.
తాజాగా పూజితతో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కు పెళ్లి అయిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వీరిద్దరూ లవ్ లో ఉన్నారని.. రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై పూజిత స్పందించింది.
పూజిత ఈ వార్తలను ఖండించింది. దేవీ శ్రీతో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అవి పూర్తి అవాస్తవాలని.. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని వార్తల్లో నిజం లేదని.. ఆయనతోనే కాదు.. తాను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని.. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నట్లు చెప్పింది పూజిత. ఇప్పటికైనా రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరింది.