Heroine Priyamani Divorce: సినీ రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఆ కలల్లో బతికినన్నీనాళ్లు బాగానే ఉంటుంది. ఆరంగుల కల మాయమైతే వాస్తవం కళ్లముందు కదలాడి విడిపోయే వరకూ సాగుతుంది. ఒక సమంత-నాగచైతన్య నుంచి నేటి ప్రియమణి- ముస్తాఫా వరకూ సినీ ప్రముఖుల పెళ్లిళ్లు కలకాలం నిలబడడం కానకష్టంగా మారింది. నమ్మకం లేని చోట ఏ బంధం కూడా ఎక్కువ కాలం మనగడ సాగించలేదు. అది ప్రేమ కావచ్చు. పెళ్లి కావచ్చు. ఒకప్పుడు అంటే పెద్దల మీద గౌరవం వల్లో, సమాజం ఏమనుకుంటుందోనన్న భయం వల్లో.. కాపురాల్లో కలతలు ఉన్నా సర్దుబాటు అనేది ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మనుషుల అవసరాలు మారాయి. ఆర్థిక స్థిరత్వం పెరిగింది. పెద్ద కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. ఫలితంగా బంధాల్లో, బంధుత్వాల్లో గాడత అనేది తగ్గింది. కలిసినంత సులభంగానే.. విడిపోవడం ప్రారంభమైంది. బయట సమాజంతో పోలిస్తే సినిమా తారలకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తి కలిగిస్తుంది. వారు మనలాంటి మనుషులే అయినప్పటికీ వారికుండే రీచ్ వల్ల ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
-ఇప్పుడు ప్రియమణి వంతు
బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఉడ్ లు చూసినా ఏమున్నది గర్వ కారణం? అంతట గాసిప్పులు లేదా బ్రేకప్ లు. సరిగ్గా కొన్ని నెలల క్రితం సినీ పరిశ్రమను నాగచైతన్య సమంత జంట ఒక ఊపు ఊపింది. ఇద్దరు కలిసి ఐదారు సినిమాల్లో నటించారు. ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో వారి వారి మతాల ప్రకారం పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. తర్వాత ఏం జరిగింది కాపురంలో కలతలు. అంతకుమించి ఇద్దరి మధ్య ఈగోలు. ఇద్దరినీ ఒకే గదిలో ఉంచి, పదునైన ఆయుధాలు ఇస్తే చంపుకునేంత స్థాయిలో పెరిగిన విభేదాలు.. సీన్ కట్ చేస్తే ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
Also Read: Tollywood- Dil Raju: టాలీవుడ్ ఫ్లాపులకు కారణం ఎవరు ? దిల్ రాజు ఆధిపత్యానికి చెక్ పడేదెప్పుడు ?
ఆ విడాకుల వల్ల వారేమో గానీ వారి అభిమానులు మాత్రం చాలా హర్ట్ అయ్యారు. ఇక రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, తమిళంలో పేరొందిన నటుడు ధనుష్ కూడా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ 15 ఏళ్లు, 12 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య పొరపచ్చాలు ఏర్పడినప్పుడు సయోధ్య కుదిరించేందుకు రజనీకాంత్ విఫలయత్నం చేశారు. ఇక బాలీవుడ్ లో అయితే హృతిక్ రోషన్, సుషానే దంపతులు విడాకులు తీసుకున్నారు. వీరికి కూడా ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఎవరి పంతం వారు నెగ్గించుకున్నారు. ఇక సల్మాన్ ఖాన్ సోదరుడైన ఆర్భాజ్ ఖాన్, మలైక అరోరా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ 17 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత మలైకా అరోరా అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. అతడు ఆమె కంటే పదేళ్లు చిన్న. వీటన్నింటి తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సుస్మితసేన్ బ్రేకప్. తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన ఓ మోడల్ తో ఆమె సహజీవనం మొదలుపెట్టింది. కొన్నేళ్లపాటు ఇది సాగింది. తర్వాత ఆమె లలిత్ మోడీ పంచన చేరింది. చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్రేకప్ లు, మరెన్నో గాసిప్పులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రియమణి అనే నటి కూడా తన భర్తతో విడాకులు తీసుకుంటుందనే వార్త సంచలనం కలిగిస్తోంది.
-పెళ్లయిన వ్యక్తిని వివాహ వాడింది
ప్రియమణి మలయాళ మూలాలున్న యువతి. బాలీవుడ్ నటి విద్యాబాలన్ కజిన్ అవుతారు. తెలుగు, తమిళం, మలయాళం లో అడపాదడపా సినిమాలు చేసిన ప్రియమణి.. తమిళంలో నటించిన పరుత్తి వీరన్ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. కానీ ఆ పురస్కారం ఆమెకు ఆశించినంత స్థాయిలో బ్రేక్ ఇవ్వ లేకపోయింది. సమయంలో ఆమె ముస్తఫా రాజ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతని మతం వేరైనప్పటికీ పెళ్లి చేసుకుంది. కానీ ముస్తఫా రాజ్ కు అప్పటికే ఓ మహిళతో పెళ్లయింది. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. దీంతో వారి పెళ్లి వివాదాస్పదమైంది. అదే సమయంలో ముస్తఫా రాజ్ కు ప్రియమణి అండగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో ప్రసారమయ్యే ఢీ రియాల్టీ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఇటీవల వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాలో అతడి భార్య గా నటించింది. ఇదే క్రమంలో ముస్తఫా రాజ్ కు, ప్రియమణికి విభేదాలు తలెత్తయని, త్వరలోనే వారు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బయట ఎంతో అన్యోన్యంగా కనిపించే ప్రియమణి, ముస్తఫా రాజ్ అకస్మాత్తుగా విడాకులు తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంటుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. రియాల్టీ షోలో కొన్ని కొన్ని సార్లు పరిమితికి మించి కో జడ్జీలతో వ్యవహరిస్తున్న తీరు ముస్తఫా రాజ్ కు నచ్చడం లేదని సమాచారం. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో ఆదితో ఆమె నడుచుకుంటున్న తీరు ముస్తఫా కు ఇష్టం ఉండటం లేదు. అది షో అయినప్పటికీ అతడు లెక్క చేయడం లేదు. ముస్తఫా ఒత్తిడి తోనే కొన్ని ఎపిసోడ్లకు ప్రియమణి రాలేదు. అందుకే ఆమె ప్లేస్ లో నందితను తీసుకున్నారు. అయితే విడాకుల పై ప్రియమణి, ముస్తఫా పెదవి విప్పకపోయినా.. తర్వాత జరిగేది అదే అని సినీ జనాలు అంటున్నారు. సామ్, నాగచైతన్య విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.
Also Read:Nandamuri Balakrishna: బాలయ్య ఎంత చదివాడో తెలుసా? ఎన్టీఆర్ అప్పుడు ఎందుకు కోప్పడ్డారు?