Pranitha Subhash: హీరోయిన్ ప్రణీత సుభాష్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆరాట పడుతుందనిపిస్తుంది. పెళ్ళై పిల్లలు పుట్టాక హాట్ నెస్ కి తెరలేపుతుంది. సోషల్ మీడియా వేదికగా తనలోని గ్లామర్ కోణం బయటపెడుతోంది. అంద చందాలతో దర్శక నిర్మాతలకు వలవేస్తుంది. వెండితెరపై పద్దతిగా కనిపించిన ప్రణీత తీరు ఆమె అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తుంది. కాగా ప్రణీత అందానికి తగ్గ స్టార్ డమ్ రాలేదు. సక్సెస్ రేటు తక్కువ కావడం దీనికి ప్రధాన కారణం. కొన్ని బడా ఆఫర్స్ వచ్చినా బ్రేక్ రాలేదు.
కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుతుండగా ప్రణీత పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. బెంగుళూరుకి చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజును ప్రణీత 2021 మార్చ్ లో వివాహం చేసుకున్నారు. ప్రణీత తన వివాహం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పెళ్ళయాక ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రణీత పెళ్లి వార్త ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు.
ఈ ఏడాది ప్రణీత తల్లి కూడా అయ్యారు. ఆమె పండంటి ఆడపిల్లలు జన్మనిచ్చారు. డెలివరీ అయ్యాక ప్రణీత పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టారు. నౌ ఐ యామ్ రెడీ అన్నట్లు ప్రణీత తీరుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించాలని ప్రణీత గట్టిగా కోరుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే అర్థం అవుతుంది. గతంలో ఎన్నడూ చూడని హాట్ నెస్ కి తెరలేపుతుంది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
మరి ప్రణీత ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి అనేది చూడాలి. ప్రస్తుతం ప్రణీత చేతిలో ఒకే ఒక కన్నడ చిత్రం ఉంది. రామన అవతార టైటిల్ తో అది తెరకెక్కుతుంది. అధికారికంగా ఎలాంటి కొత్త చిత్రాల ప్రకటన జరిగిన దాఖలాలు లేవు. పెళ్లికి ముందు వరుసగా రెండు బాలీవుడ్ చిత్రాలు చేశారు.ప్రణీత హీరోయిన్ గా నటించిన హిందీ చిత్రాలు హంగామా 2, భుజ్ పెద్దగా సందడి చేయలేదు. ఇక తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ప్రణీత కెరీర్లో అత్తారింటికి దారేది అతిపెద్ద హిట్ గా ఉంది.