https://oktelugu.com/

Pragya Jaiswal: ప్యాంటు విప్పేసి లోదుస్తులు చూపించిన బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్!

నక్షత్రం డబుల్ డిజాస్టర్. ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలియదు. పరిశ్రమలో సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్ కే మైలేజ్ ఉంటుంది. వరుస పరాజయాలతో ప్రగ్యా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.

Written By:
  • Shiva
  • , Updated On : May 21, 2023 / 10:58 AM IST

    Pragya Jaiswal

    Follow us on

    Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి టైం కలిసి రాలేదు. అందం అభినయం ఉండి కూడా స్టార్ కాలేకపోయింది. సక్సెస్ దక్కక రేసులో వెనుకబడిపోయింది. ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ బ్రేక్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన కంచె మూవీలో అవకాశం ఇచ్చాడు. కంచె ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అనంతరం మనోజ్ కి జంటగా గుంటూరోడు చిత్రంలో నటించింది. ఇది డిజాస్టర్. క్రియేటివ్ డైరెక్టర్ నక్షత్రం టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కించారు. అందులో ప్రగ్యాకు ఛాన్స్ దక్కింది.

    నక్షత్రం డబుల్ డిజాస్టర్. ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలియదు. పరిశ్రమలో సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్ కే మైలేజ్ ఉంటుంది. వరుస పరాజయాలతో ప్రగ్యా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ యావరేజ్. ఇక మంచు విష్ణుకు జంటగా నటించిన ఆచారి అమెరికా యాత్ర మరో డిజాస్టర్. ఈ సమయంలో ఆమెకు అఖండలో ఆఫర్ రావడం గొప్ప విషయం.

    అఖండ మూవీ నాటికి బాలయ్య పరిస్థితి కూడా ఏం బాగోలేదు. ఆయన పూర్తిగా ఫార్మ్ కోల్పోయాడు. ఆయన పక్కన నటించేందుకు హీరోయిన్స్ ముందుకు రావడం లేదు. దాంతో ప్రగ్యాకు ఛాన్స్ వచ్చింది. అలాగే క్రిష్, బోయపాటి శ్రీనులతో ఉన్న అనుబంధం రీత్యా అఖండలో బాలయ్యతో జతకట్టే బంపర్ ఆఫర్ కొట్టేసింది. అఖండ బ్లాక్ బస్టర్ కాగా ప్రగ్యా ఫేట్ మారిపోయిందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కనీసం టైరు టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు.

    పోయిపోయి మోహన్ బాబు సినిమాలో నటించాల్సి వచ్చింది. సన్ ఆఫ్ ఇండియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సన్ ఆఫ్ ఇండియా తర్వాత ప్రగ్యా మరో చిత్రం చేయలేదు.ప్రగ్యా దాదాపు ఫేడ్ అవుట్ అయినట్లే. ఈ క్రమంలో సోషల్ మీడియాను నమ్ముకుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఉచితంగా అందాలు ప్రదర్శిస్తుంది. తాజాగా బోల్డ్ ఫోటో షూట్ చేసింది. లోదుస్తులు కన్పించేలా దారుణమైన ఫోజుల్లో సెగలు రేపారు. ప్రగ్యా ఫోటో షూట్ వైరల్ అవుతుంది.