Meena: ఒకప్పుడు 90లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి మీనా. సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ వరకు ప్రతి హీరోతో హిట్లు అందుకుంది ఈ హీరోయిన్. ముఖ్యంగా అప్పట్లో వెంకటేష్, మీనా కాంబినేషన్ అంటే ఆ సినిమా తప్పక హిట్ అని నమ్మకం ఉండేది. ఇక ఈ మధ్య కూడా వెంకటేష్ తో దృశ్యంలో నటించి.. తమ హిట్ కాంబినేషన్ ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో మీనా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
త్వరలో మీనా టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భర్త మరణం తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న ఈ నటి మళ్లీ కెమెరా ముందుకు రావడానికి ఆసక్తి గా ఉన్నారు అని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఒంటరి తనం నుంచి బయట పడటానికి ఆమె పలు భాషలను కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా తాను ఒక హిందీ వెబ్ సీరియస్ లో చేస్తోందని.. ఇక తన తదుపరి హిందీ వెబ్ సిరీస్ కోసం
షూట్ అనంతరం ఖాళీ సమయం లో హిందీ నేర్చుకోవడంపై ఆమె దృష్టి పెట్టారు అని తెలుస్తోంది. త్వరలో హిందీలో తనే స్వయంగా డైలాగులు చెప్పేందుకు సిద్ధమవుతున్నారట. ఇక బాలీవుడ్ లో
కొన్ని బోల్డ్ సిరీస్ లు కూడా చేయాల్సి వస్తే నటిస్తాను అంటూ మీనా తన సన్నిహితులతో చెబుతుందట.
అంతేకాదు మీనా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం
ఒక ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ ‘నటి అన్నప్పుడు ఒక్కోసారి బోల్డ్ గా నటించాల్సి వస్తోంది. గతం లో హీరోయిన్ గా నటించే సమయం లో నేను కొన్ని బోల్డ్ పాత్రలు చేశాను. అయితే, లేటు వయసులో ఘాటు పాత్రలను సౌత్ హీరోయిన్స్ చేయరు. కానీ నార్త్ లో చాలా మంది చేస్తున్నారు. అందుకే, నార్త్ లో నేను ఎలాంటి బోల్డ్ రోల్స్ అయినా చేస్తాను. 100% మనసు పెట్టి పని చేస్తాను’ అంటూ మీనా చెప్పుకొచ్చింది.
మరి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మీనా స్టార్ స్టేటస్ అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.