Athulya Ravi: ప్రేమ.. పెళ్లి.. సెక్స్ గురించి హీరోయిన్లు చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా ఈ మూడిటి పైన ప్రతి ఒక్కరికి భిన్న అభిప్రాయాలు ఉండటం సహజం. కొంతమంది హీరోయిన్లు పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు అంతే మరి కొంతమంది మాత్రం అది తప్పే అంటూ ఉంటారు. మొత్తానికి ఎవరి దృష్టిలో వారు కరెక్ట్ అంటూ ప్రేక్షకులు తమతమ ఇష్టమైన హీరోయిన్ల ను వెనకేసుకుని వస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో ఇదే క్షణం గురించి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత సినిమాలో నటించిన ఒక హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మహిళలు అవుతున్నాయి.
కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన మీటర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ అతుల్య రవి. కాగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో ఈ అమ్మడికి తెలుగులో అయితే అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో తమిళంలో అవకాశాలు అందుకుంటూ విజయవంతంగా కెరియర్ లో దోసుకుపోతోంది. తమిళ సినిమా రంగంలో రాణిస్తున్న అతుల్య రవి తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరియర్ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడింది.
అతుల్య రవి ముందుగా తన గురించి చెబుతూ.. తాను దేని గురించైనా నిర్మొహమాటంగా చెప్పేస్తానని స్పష్టం చేసింది. ‘సినిమా ఎంపికైన.. ఏదైనా మనసులో దాచుకోకుండా మొఖం మీద చెప్పేయడం నాకు అలవాటు. నేటి యువతలో సహజీవనం చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో బంధాల విషయంలో కొత్త వాతావరణం కనిపిస్తోంది. అయితే నా దృష్టిలో సహజీవనం అనేది వ్యక్తిగత విషయం’ అని చెప్పుకొచ్చింది.
‘పెళ్లికి ముందు శృంగారాన్ని సమర్థించను. ఇది మన భారతీయ సంస్కృతికి విరుద్ధం. అయితే అది కావాలనుకుంటే పెళ్లి చేసుకోవడం ఉత్తమం. అంతేకాదు ప్రేమలో పడేవాళ్లు జీవితం స్థిరపడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. జీవితంలో స్థిర పడకుండా పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇది నా అభిప్రాయం’అంటూ మంచి మాటలు చెప్పుకొచ్చింది అతుల్య.
ఇక ఏమి చేసిన వ్యాఖ్యలు విని సోషల్ మీడియాలో పలువురు ఆమెను పొగిడేస్తున్నారు.