https://oktelugu.com/

Krithi Shetty: కృతి శెట్టిని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు… వర్షంలో తడిసిన బార్బీ డాల్!

ఇంస్టాగ్రామ్ లో కృతి పద్దతిగా ఫోటో షూట్స్ చేసేవారు. చూస్తుంటే స్కిన్ షో చేయకూడదన్న నియమం వదిలేసినట్లు ఉంది. ఈ మధ్య కాలంలో కృతి ఫోటో షూట్స్ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తాజాగా షార్ట్ ఫ్రాక్ లో బార్బీ గర్ల్ ని అంటూ క్రేజీ లుక్ షేర్ చేశారు. కృతి శెట్టి ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. కృతి ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. దీంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి.

Written By:
  • Shiva
  • , Updated On : July 22, 2023 / 11:22 AM IST

    Krithi Shetty

    Follow us on

    Krithi Shetty: పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అదృష్టం కలిసొచ్చి మంచి ఆరంభం దొరికినా దాన్ని నిలబెట్టుకోవాలి. ఇక ట్రెండ్ ని ఫాలో అవ్వాలి. మడిగట్టుకు కూర్చుంటే పట్టించుకునే నాథుడు ఉండడు. హీరోయిన్ కృతి శెట్టి ఈ విషయాన్ని త్వరగానే అర్థం చేసుకుంది. నాలుగు ప్లాప్స్ పడగానే పంథా మార్చేసింది. గ్లామరస్ ఫోటో షూట్స్ కి తెరలేపింది. సిల్వర్ స్క్రీన్ మీద కృతి ఎక్స్ పోజ్ చేసింది లేదు. అయితే కథలో భాగంగా శృంగార సన్నివేశాల్లో నటించారు.

    ఇక ఇంస్టాగ్రామ్ లో కృతి పద్దతిగా ఫోటో షూట్స్ చేసేవారు. చూస్తుంటే స్కిన్ షో చేయకూడదన్న నియమం వదిలేసినట్లు ఉంది. ఈ మధ్య కాలంలో కృతి ఫోటో షూట్స్ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తాజాగా షార్ట్ ఫ్రాక్ లో బార్బీ గర్ల్ ని అంటూ క్రేజీ లుక్ షేర్ చేశారు. కృతి శెట్టి ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. కృతి ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. దీంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి.

    ఉప్పెన తర్వాత కృతి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సైతం హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో ఎంట్రీతో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన హీరోయిన్ గా కృతి పేరున అరుదైన రికార్డు నమోదైంది. అయితే వరుస హిట్స్ ఇచ్చిన కృతి శెట్టిని వరుస పరాజయాలు వెంటాడాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి దారుణ పరాజయం చూశాయి. నాగ చైతన్యతో చేసిన కస్టడీ చిత్రం మీద చాలా ఆశలే పెట్టుకుంది. కస్టడీ సైతం ప్లాప్ ఖాతాలో చేరింది.

    కృతికి తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. శర్వానంద్ కి జంటగా ఒక చిత్రం చేస్తుంది. శర్వానంద్ కూడా విజయాలు లేక స్ట్రగుల్ అవుతున్నారు. ఇటీవల జయం రవికి జంటగా ఒక తమిళ చిత్రం ప్రకటించింది. అలాగే మలయాళంలో ఒక మూవీ చేస్తుంది. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిన టాలీవుడ్ లో ఉనికి కోల్పోతే చాలా నష్టపోయినట్లే. అందుకే సూపర్ హిట్ కొట్టి క్రేజీ హీరోయిన్ కావాలని ఆశపడుతోంది. మరి చూడాలి కృతి కెరీర్ ఎలాంటి మలుపులు తిరగనుందో…