https://oktelugu.com/

Ileana D’Cruz: రెండవసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ఇలియానా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటో!

రెండవసారి కూడా తల్లి కాబోతున్నందుకు ఆమెకు అభిమానులు సర్వత్రా శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ఒకప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ప్రతీ రోజు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వచ్చిన ఇలియానా, ఈమధ్య కాలం లో సైలెంట్ గా ఉంటుంది.

Written By: , Updated On : February 15, 2025 / 07:47 PM IST
Ileana D'Cruz

Ileana D'Cruz

Follow us on

Ileana D’Cruz: ప్రముఖ స్టార్ హీరోయిన్ ఇలీయానా(ileana d’cruzz) ఇటీవలే మైఖేల్ డొలిన్(Mikhel Dolin) అనే వ్యక్తిని పెళ్ళాడి, 2023 వ సంవత్సరం ఆగస్టు లో పండింటి బాబు కి జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కొంతకాలం వరకు సోషల్ మీడియా కి దూరం గా ఉంటూ వచ్చిన ఇలియానా, అకస్మాత్తుగా గర్భం దాల్చిన ఫోటోలను అప్లోడ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అనిపించింది. ఇప్పుడు అభిమానులకు మరోసారి ఆమె పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలో తాను రెండవసారి తల్లి కాబోతున్నానని పరోక్షంగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫొటోలో ప్రెగ్నన్సీ కిట్ తో పాటు, మిడ్ నైట్ స్నాక్స్ ఉన్నాయి. నువ్వు గర్భవతివని నాకు చెప్పకుండా గర్భవతిని అని చెప్పు అంటూ ఒక ట్యాగ్ కూడా రాసుకొచ్చింది. ఆమె షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

రెండవసారి కూడా తల్లి కాబోతున్నందుకు ఆమెకు అభిమానులు సర్వత్రా శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ఒకప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ప్రతీ రోజు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వచ్చిన ఇలియానా, ఈమధ్య కాలం లో సైలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె ఈ శుభవార్త షేర్ చేయడం అందరికి పెద్ద సర్ప్రైజ్ గా మారింది. ‘దేవదాసు’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ గోవా బ్యూటీ, మొదటి చిత్రంతోనే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన రెండవ సినిమా ‘పోకిరి’ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్ తో సూపర్ హిట్స్ ని అందుకొని నెంబర్ 1 హీరోయిన్ గా మారింది.

కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా ఆమె స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలా కెరీర్ పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయంలో ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ అడపాదడపా ఒకటి రెండు హిట్ సినిమాలు ఈమెకు పడినప్పటికీ, ఎందుకో అవకాశాలు ఆశించిన స్థాయిలో ఆ తర్వాత కొనసాగలేదు. దీంతో సౌత్ లో ఆమె ఖాళీ చేసి వెళ్లిన స్థానాన్ని తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్ వంటి వారు భర్తీ చేసారు. దీంతో అటు హిందీ లో అవకాశాలు భారీగా రాక, ఇటు సౌత్ లో అవకాశాలు కోల్పోయి ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఒక సాధారణ గృహిణి గా తన జీవితాన్ని గడుపుతుంది. అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ ఉంటుంది.