రాంచరణ్-శంకర్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేయబోచే సినిమా దిగ్గజ దర్శకుడు శంకర్ తోనే. ఆ సినిమా ఇప్పటికే ప్రకటించారు. ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా ఉండబోతోంది. ఇప్పటికే ప్రకటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా హిందీ బ్యూటీ ఎంపికైంది. ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా చివరకు ఈ ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర బృందం శనివారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని రాంచరణ్ సరసన […]

Written By: NARESH, Updated On : July 31, 2021 1:13 pm
Follow us on

‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేయబోచే సినిమా దిగ్గజ దర్శకుడు శంకర్ తోనే. ఆ సినిమా ఇప్పటికే ప్రకటించారు. ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా ఉండబోతోంది. ఇప్పటికే ప్రకటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా హిందీ బ్యూటీ ఎంపికైంది. ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా చివరకు ఈ ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర బృందం శనివారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని రాంచరణ్ సరసన హీరోయిన్ గా దర్శకుడు శంకర్ ఎంపిక చేవాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోకి స్వాగతం చెబుతూ ఓ ఫొటోను షేర్ చేశారు.

ఇప్పటికే రాంచరణ్ సరసన కియారీ ‘వినయ విధేయ రామా’ అనే సినిమాను చేసింది. రాంచరణ్ 15వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం.

ఈ భారీ బడ్జెట్ మూవీని 2024లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’తోపాటు ‘ఆచార్య సినిమా షూటింగ్ లతో బిజిగా ఉన్నారు. ఈ రెండూ పూర్తయ్యాక శంకర్ సినిమా పట్టాలెక్కనుంది.