‘చరణ్ – శంకర్’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ !

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుందనే వార్త రాగానే ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దాంతో అందరూ ఈ ప్రాజెక్ట్ పై అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ పుట్టుకొస్తోంది. అయితే తాజాగా పుట్టిన పుకారు నమ్మేలా ఉండటంతో ఈ వార్త సోషల్ […]

Written By: admin, Updated On : June 5, 2021 5:48 pm
Follow us on

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుందనే వార్త రాగానే ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దాంతో అందరూ ఈ ప్రాజెక్ట్ పై అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ పుట్టుకొస్తోంది.

అయితే తాజాగా పుట్టిన పుకారు నమ్మేలా ఉండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ‘మాస్టర్’ సినిమాతో బాగా పాపులర్ అయిన మాళవిక మోహనన్ కి, తమిళంలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. పైగా ఆమె చేతిలో భారీ సినిమాలు కూడా ఏమీ లేవు.

దాంతో చరణ్ – శంకర్ సినిమాలో మాళవిక మోహనన్ నే దాదాపు ఖాయం అయ్యేలా ఉంది. శంకర్ ఎక్కువుగా ఖాళీగా ఉన్న మీడియం రేంజ్ హీరోయిన్లనే తన సినిమాల్లో తీసుకుంటాడు కాబట్టి, మాళవికకు భారీ ఆఫర్ వచ్చినట్టే. ఇక ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నారు.

అయితే, నేపథ్య సంగీతాన్ని మాత్రం అనిరుధ్ రవిచందర్ ఇస్తున్నాడట. మామూలుగా అయితే శంకర్ సినిమాలకు నేపథ్య సంగీతం కూడా రహమానే ఇస్తుంటాడు. కాకపోతే బిజీ షెడ్యూల్ కారణంగా రహమాన్ ఈ సినిమాకి సాంగ్స్ ను మాత్రమే కంపోజ్ చేస్తున్నాడు. ఇక చరణ్ – శంకర్ కాంబినేషన్ తొలిసారి కావడంతో బడ్జెట్ పై ఎలాంటి ఆంక్షలు లేకుండా సినిమాని భారీ హంగులతో తెరకెక్కించడానికి శంకర్ సన్నద్ధం అవుతున్నాడు.