Eesha Rebba: కొంచెం కలర్ తక్కువేమో కానీ బాలీవుడ్ రేంజ్ గ్లామర్ ఈషా రెబ్బా సొంతం. ఈ ఓరుగల్లు భామకు బ్రేక్ రావడం లేదు. స్టార్ అయ్యే ఛాన్స్ దక్కడం లేదు. దర్సకుడు శేఖర్ కమ్ముల ఈషా రెబ్బాను వెండితెరకు పరిచయం చేశాడు. హ్యాపీ డేస్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైటిల్ తో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. ఆ మూవీలో ఈషా రెబ్బా నటించింది. అనంతరం ఈషా నటించిన అమీ తుమీ, అ చిత్రాలకు పాజిటివ్ టాక్ దక్కింది.
సోలో హీరోయిన్ గా ఆమె నిలదొక్కుకోలేదు. చిన్న సినిమాల్లో లీడింగ్ క్యారెక్టర్స్, పెద్ద హీరోల సినిమాల్లో ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ ఛాన్సులు వచ్చేవి. అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా హీరోయిన్ పూజా హెగ్డే చెల్లి పాత్ర చేసింది. కానీ ఆమె పాత్రకు కనీస ప్రాధాన్యత ఉండదు. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో వ్యాంప్ తరహా పాత్ర చేసింది.
టాలీవుడ్ మేకర్స్ కన్నడ, మలయాళ, ముంబై భామల వెనుకబడతారు. కోట్లు కుమ్మరించి వాళ్ళను తెచ్చుకుంటారు కానీ టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలను పట్టించుకోరు. లోకల్ హీరోయిన్స్ నిరాదరణకు గురవుతున్నారనేది నిజం. ఇటీవల ఈషా తన అసహనం బయటపెట్టింది. పొరుగు పరిశ్రమల వాళ్ళు టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలకు మాత్రం అవకాశాలు రావని ఆమె అన్నారు.
ఇటీవల సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేసిన మామా మశ్చీంద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇది డిజాస్టర్ అయ్యింది. దయ టైటిల్ తో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్లో జేడీ చక్రవర్తి భార్య రోల్ చేసింది. దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఇదిలా ఉంటే అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చింది. బీచ్ లో రెచ్చిపోయిన ఈషా బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది.