Naga Chaitanya-Divyamsha : యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ తో నాగ చైతన్య ఎఫైర్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. మజిలీ మూవీలో దివ్యాంశ కౌశిక్ నాగ చైతన్యతో జతకట్టింది. ఇక నాగ చైతన్య అంటే ఇష్టం అంటూ దివ్యాంశ కౌశిక్ ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడిన నేపథ్యంలో పుకార్లకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. అయితే ఈ వార్తలపై దివ్యాంశ కౌశిక్ స్పందించారు. నాగ చైతన్యతో తనకు ఎఫైర్ ఉందన్న వార్తల్లో నిజం లేదన్నారు. మైఖేల్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న దివ్యాంశ కౌశిక్ ఈ మేరకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐ లవ్ నాగ చైతన్య. ఆయనంటే నాకు ఇష్టం.ఆయనపై నాకు క్రష్ ఉంది. నాగ చైతన్య చాలా అందంగా ఉంటాడు. అయితే ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నానన్న పుకార్లు నా చెవిన పడలేదు. ఎవరైనా అనుకున్నా అది అబద్ధం. ఆయన్ని నా సీనియర్ నటుడిగా మాత్రమే చూస్తాను. మేము ఎవరి కెరీర్లో వారు బిజీగా ఉన్నాము. రవితేజతో చేసిన రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఛాన్స్ నాగ చైతన్య ఇప్పించారనే పుకారు కూడా ఉంది. అది కూడా నిజం కాదని దివ్యాంశ కౌశిక్ వెల్లడించారు.
2019లో విడుదలైన మజిలీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ మూవీలో సమంత ప్రధాన హీరోయిన్. దివ్యాంశ కౌశిక్ కి మజిలీ డెబ్యూ మూవీ. ఆ చిత్రంతోనే వెండితెరకు పరిచయమైంది. కారణం తెలియదు కానీ నాగ చైతన్య-ఆమెకు సన్నిహితంగా ఉంటున్నాడన్న పుకార్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం దివ్యాంశ కౌశిక్ మైఖేల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 3న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకోగా మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. మైఖేల్ తనకు బ్రేక్ ఇస్తుందని దివ్యాంశ కౌశిక్ భావిస్తుంది.
ఇక నాగ చైతన్య విషయానికొస్తే తరచూ ఆయన ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నారు. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య సీరియస్ ఎఫైర్ నడిపారన్న కథనాలు టాలీవుడ్ ని ఊపేశాయి. ఆమెతో తిరుగుతున్న నాగ చైతన్య పెళ్లి చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ కథనాలపై నాగ చైతన్య టీమ్ స్పందించారు. అదేమీ లేదంటూ ఖండించారు. శోభిత అయితే నేరుగా అంతా అబద్దం అంటూ కొట్టిపారేశారు. ఇక 2021లో భార్య సమంతకు నాగ చైతన్య విడాకులు ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. నాగ చైతన్యకు వివాహం అంటూ కథనాలు వెలువడుతున్నా అవి పుకార్లుగానే మిగిలిపోతున్నాయి.