Homeఎంటర్టైన్మెంట్Heroine Anjali: హీరోయిన్ అంజలిని దారుణంగా మోసం చేసి ఆర్థికంగా దెబ్బ తీసింది ఎవరో తెలుసా?

Heroine Anjali: హీరోయిన్ అంజలిని దారుణంగా మోసం చేసి ఆర్థికంగా దెబ్బ తీసింది ఎవరో తెలుసా?

Heroine Anjali: మన తెలుగు సినిమాల్లో తెలుగు వారు హీరోయిన్లుగా రాణించడం తక్కువే. అంతా పరాయి భాష నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇక్కడి వారు అరుదుగానే అవకాశాలు దక్కించుకుంటున్నారు. అందులో అంజలి కూడా ఒకరు అని తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి కొన్నాళ్ల పాటు రాజమండ్రిలో చదువుకుంది. తరువాత చెన్నైలో ఉన్న బాబాయ్ పిన్ని ఇంటి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. మొదట షాట్ ఫిల్మ్ ల్లో తన ప్రతిభ చాటుకుంది. దీంతో ఆమెకు జీవా సినిమాలో నటించే చాన్స్ దక్కడంతో సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభించాయి. ఈ సినిమా తెలుగులో డేర్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

Heroine Anjali
Heroine Anjali

డెబ్యూ అనే సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. 2006లో ఫాలో సినిమాలో తన సత్తా చాటింది. షాపింగ్ మాల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తీసుకొచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో జర్నీ సినిమాలో నటించి మరింత ప్రతిష్ట పెంచుకుంది. ఆమె నటనకు జీవం పోసింది. తెలుగు అమ్మాయిగా తనదైన శైలిలో పేరు రావడం తెలుస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేశ్ క జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసంది.

Also Read: Keerthy Suresh: ఎవరీ దేవకన్య.. సోషల్ మీడియాని ఊపేస్తోందే

మసాలా సినిమాలోనూ వెంకీతో జతకట్టి తనటాలెంట్ నిరూపించుకుంది. రవితేజ మలుపు సినిమాలోనూ మంచి పాత్ర దక్కించుకుని తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక గీతాంజలి సినిమాలో లేడీ ఓరియంటెడ్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం ఆమెకు సహజలక్షణం. దీంతో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. తెలుగు సినిమాల్లో కూడా మంచి పాత్రలు దక్కించుకుని ఎదురు లేదని సూచిస్తోంది.

Heroine Anjali
Heroine Anjali

అంజలిని సొంత వారే మోసం చేసినట్లు తెలుస్తోంది. నమ్మకస్తులుగా ఉన్న పిన్ని, బాబాయ్ ఆమెను వాడుకుని వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మూడు కోట్ల వరకు నష్టపోయినట్లు భావిస్తున్నారు. అంజలి మంచి తనాన్ని ఆసరాగా చేసుకుని కష్టాల్లో పడేసినట్లు చెబుుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆర్థిక కష్టాల్లో పడిపోయింది. డబ్బులు తీసుకుని మోసం చేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. గతంలో నటి శ్రీదేవి విషయంలో కూడా ఇలాంటి తప్పిదాలే జరిగినట్లు తెలిసిందే. అప్పుడు ఆమె చెల్లెలు ఆస్తిని మొత్తం దక్కించుకోవడంతో శ్రీదేవి కష్టాల్లో పడిన విషయం విధితమే. ఇప్పుడు అంజలికి కూడా అదే పరిస్థితి రావడం గమనార్హం.

ఓ తమిళ దర్శకుడు కూడా అంజలిని ఆర్థికంగా వాడుకుని వదిలేసినట్లు తెలుస్తోంది. అందరు ఆమెను ఓ ఏటీఎం యంత్రంలా వాడుకున్నట్లు వాపోతోంది. ప్రస్తుతం పడుతున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. అయినా ఇప్పటి వరకు ఎవరు కూడా ఆదుకోకపోవడంతో ఆమె దీనంగా ఎదురు చూస్తోంది. కానీ ఆమె ఆశలు తీరుతాయో లేదో తెలియడం లేదు.

Also Read:YS Bharathi- Sarkaru Vaari Paata: మహేష్ సినిమా పై జగన్ సతీమణి ప్రశంసలు

Recommended Videos
జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ కి కారణం ఇదే | Jr NTR 39th Birthday Special Video | Oktelugu Entertainment
మళ్లీ ఒక్కటైన షణ్ముక్, దీప్తి సునైనా..? || Deepthi Sunaina And Shanmukh Jaswanth Relationship
డెడ్ చీప్ అయిపోయిన హీరో || Tollywood Young Hero Remuneration || Oktelugu Entertainment

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version