https://oktelugu.com/

Aditi Rao Hydari: కమిట్మెంట్ ఇచ్చి గోల చేయటం అనవసరం .. హాట్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

కాస్టింగ్ కౌచ్ వలన నటనకు దూరమైనా వాళ్ళు కొందరు ఉంటే, కాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకొని అవకాశాలు పొందిన వాళ్లు ఇంకొందరు.

Written By:
  • Shiva
  • , Updated On : August 7, 2023 / 03:49 PM IST

    Aditi Rao Hydari

    Follow us on

    Aditi Rao Hydari: కాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లో వినిపించే పేరు ఇది. గతంలో నటన నైపుణ్యం ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ ఇప్పుడు టాలెంట్ ఎంత ఉన్న కానీ దానికి మించిన “ఏదో ఒకటి లేకపోతే” అవకాశాలు రావడం తక్కువ. ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్ అనేది పరిశ్రమలో విషసర్పం గా మారిపోయింది. దీనిపై గతంలో “మీటూ” అనే పేరుతో పెద్ద స్థాయిలో చర్చలు జరిగిన పెద్దగా ఫలితం లేదని చెప్పాలి.

    అయితే మీటూ సమయంలో చాలా మంది నటీమణులు బయటకు వచ్చి, తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా చెప్పారు. కాస్టింగ్ కౌచ్ వలన నటనకు దూరమైనా వాళ్ళు కొందరు ఉంటే, కాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకొని అవకాశాలు పొందిన వాళ్లు ఇంకొందరు. అసలు కాస్టింగ్ కౌచ్ కు చిక్కకుండా తెలివిగా తమ కెరీర్ ను ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు ఇంకొందరు ఉన్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే ఓపెన్ అయింది. ఆమె ఎవరో కాదు అదితిరావు హైదరీ. ఆమె తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

    తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటిపై ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏదైనా సరే అమ్మాయిల బలహీనత మీదనే ఆధారపడి ఉంటుంది. ఇష్ట పూర్వకంగా కమిట్ మెంట్లు ఇచ్చిన తర్వాత మళ్లీ దీనిపై మాట్లాడటం అనవసరం. మనం బలహీనంగా ఉంటేనే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కాబట్టి ముందు మనల్ని మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరూ లొంగొద్దు అంటూ కామెంట్స్ చేసింది ఈ చిన్నది.

    ఆమె మాటలు గమనిస్తే వాస్తవమే అని తెలుస్తుంది. కొందరు తమ అవసరాల కోసం కాస్టింగ్ కౌచ్ కి అంగీకరించి, ఆ తర్వాత తనకు అన్యాయం జరిగిందని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు అసలు వాటికీ దూరంగా ఉండాలి అనేది హైదరీ వాదన. ప్రస్తుతం హీరో సిద్ధార్ లో డేటింగ్ లో ఉన్న ఆమె అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉంది.