Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’ సినిమాలో నటించిన ఈమె ఎవరో గుర్తుపట్టారా?

సౌమ్య మీనన్ చిన్న చిన్న వీడియోలు చేసి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసేది. అలా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఆ తరువాత మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చింది.

Written By: Chai Muchhata, Updated On : August 7, 2023 3:25 pm

Sarkaru Vaari Paata

Follow us on

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలో ఒక క్రేజ్. దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా.. నేటి కుర్రాళ్లకు పోటీ ఇస్తూ సినిమాలు తీస్తున్నాడు. ఆయన లాస్ట్ మూవీస్ వరుసగా హిట్టుకొట్టాయి. ఇందులో ‘సర్కారు వారి పాట’ ఒకటి. ఫైనాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్టు కొట్టింది. ఈ సినిమాలో మహేష్ తో పోటీగా హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. అయితే కీర్తి సురేష్ స్నేహితురాలిగా ఓ అమ్మాయి నటించింది. ఆమె హీరోయిన్ తో సమానంగా అందంగా కనిపించింది. కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గరికి వెళ్లినప్పుడు ఆమెను పొగుడుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ఈ భామను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె ఓ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

కీర్తి సురేష్ స్నేహితురాలిగా నటించిన ఈమె పేరు సౌమ్య మీనన్. ఈమెకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆమెకు సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆమెతో సినిమా తీయడానికి ఓ డైరెక్టర్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా పేరు ‘సర’. ఇటీవలే సౌమ్య బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘సర’ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. దీనిని వి. శశిభూషన్ డైరెక్షన్ చేస్తున్నాడు. డిఫరెంట్ కథాంశతో వస్తున్న ఈ మూవీ సక్సెస్ అవుతుందన్న ఆనందంలో సౌమ్య ఫుల్ హ్యపీగా ఉంది.

సౌమ్య మీనన్ చిన్న చిన్న వీడియోలు చేసి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసేది. అలా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఆ తరువాత మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చింది. చిన్న పాత్రే అయినా ఇందులో మహేష్ బాబు హీరో కావడంతో ఆమె ఒప్పుకుంది. ఈ సినిమా హిట్టుకొట్టడంతో ఆమెకు కూడా గుర్తింపు వచ్చింది. దీంతో వెంటనే ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ లో సౌమ్య మీనన్ ఎంతో అందంగా ఉంది.ఈ సినిమా సక్సెస్ అయితే సౌమ్యకు తిరుగు లేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.