https://oktelugu.com/

Adah Sharma: హిట్ పడినా బన్నీ హీరోయిన్ ఫేట్ మారలేదుగా… అయ్యో ఆదా శర్మా!

ఆదా శర్మ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ది కేరళ స్టోరీ లో ఆదా శర్మ .. షాలిని ఉన్నికృష్ణన్ గా నటించింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2024 / 11:59 AM IST

    Adah Sharma

    Follow us on

    Adah Sharma: నటి అదా శర్మ ‘ హార్ట్ ఎటాక్ ‘ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. తన అందచందాలతో కుర్రాళ్ళు కు హార్ట్ ఎటాక్ తెప్పించింది. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామ కు సరైన గుర్తింపు రాలేదు. లాస్ట్ ఇయర్ ‘ ది కేరళ స్టోరీ ‘ తో హిట్ కొట్టింది. కానీ ఈ ముద్దుగుమ్మ కి ఇప్పటికీ కెరీర్ లో సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. ‘ ది కేరళ స్టోరీ ‘ సినిమాతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

    ఆదా శర్మ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ది కేరళ స్టోరీ లో ఆదా శర్మ .. షాలిని ఉన్నికృష్ణన్ గా నటించింది. ISIS వలలో చిక్కి, బలవంతంగా మతమార్పిడి గురైన హిందూ యువతి పాత్రలో ఆదా నటన అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఆదా ఎక్కువగా తాను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే పాపులర్ అయింది. చేతి నిండా సినిమాలు లేకపోయినా ఫోటో షూట్లతో వార్తల్లో నిలవడం అదా శర్మ ప్రత్యేకత.

    కేరళ స్టోరీ సినిమాకు గాను ఆదా శర్మ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంది. ఆదా శర్మ నికర ఆదాయం విలువ దాదాపు రూ. 10 కోట్లు వరకు ఉన్నట్లు సమాచారం. ఈ బాలీవుడ్ బ్యూటీ మోడలింగ్ లో రాణిస్తూనే, సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్ అటెండ్ అయింది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు.

    అన్నింట్లో ఈమెకు ఎక్కువ రిజెక్షన్ ఎదురైంది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాక తొలి సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అవకాశం రావడానికి ఆరేళ్ళు పట్టింది. కేవలం సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఈ భామకు ఎంత కష్టపడినా అనుకున్నంత గుర్తింపు మాత్రం రావడం లేదు.