Thanya Ravichandran: హీరో కార్తికేయ, హీరోయిన్ తాన్యా రవించంద్రన్ జంటగా నటించిన సినిమా రాజా విక్రమార్క. వివి వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆది రెడ్డి టి. సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబరు 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిన్నతనం నుంచి తనకు సినిమాలంటే ఎంతో ఆసక్తిగా తెలిపింది. రాజా విక్రమార్క కథతో పాతు తన పాత్ర ఎంతగానే ఆకట్టుకోవడంతో ఈ సినిమా చేసినట్లు పేర్కొంది. ఇందులో తన పాత్ర పేరు కాంతి.. హోమ్ మినిష్టర్ కుమార్తె అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయి అని తాన్యా వివరించింది.
అయితే, తనకు సినిమా అవకాశాలు వచ్చినప్పుడు.. తమ తల్లిదండ్రులు పీజీ పూర్తి చేసిన తర్వాత సినిమాలు చేయమని చెప్పినట్లు తాన్యా తెలిపింది. కానీ, ఆ సమయంలో ఛాన్స్ రావడంతో ఒక్క సినిమా చేస్తానని ఒప్పింది.. వరుసగా తమిళంలో మూడు సినిమాలు చేసేశాను. అవి పూర్తయ్యాక పూజీ కూడా పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. మా తాతయ్య(హీరో రవిచంద్రన్) చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయనకు క్రమశిక్షణ, అంకితభావం ఎక్కువ ఆ మూడు ఆయన నుంచే నేర్చుకున్నట్లు తాన్య తెలిపింది. తనకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఎంతో ఇష్టమని తాన్యా తెలిపింది. ప్రస్తుతం తమిళ్లో ఐదు సినిమాలకు ఓకే చెప్పినట్లు.. అందులో కొన్ని షూటింగ్ కూడా మొదలైనట్లు తాన్యా తెలిపారు.