Director Shankar: ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. స్క్రీన్ మీద ప్రేక్షకుడి ఊహ కు అందని ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో అతనిని మించినవారు ఇంకెవరు లేరు… గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే ఆయన తన సినిమాలతో గ్రాఫిక్స్ చేసి చూపించాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక దేశం తాలూకు అందాన్ని చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పాటలను స్క్రీన్ మీద చాలా అద్భుతంగా చెక్కుతాడు… గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. సుజాత అనే రైటర్ చనిపోయిన తర్వాత ఆయన కథల్లో పట్టు తగ్గింది. అవి ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.
దానివల్ల ఆయన చేసిన సినిమాలన్నీ ఏపీ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తో చేసిన ‘గేమ్ చేంజర్ ‘ సినిమా డిజాస్టర్ ని మిగిల్చడంతో అతని పేరు ఇండస్ట్రీలో వినిపించకుండా పోయింది. ఇక ప్రస్తుతం అతను ఎవరితో సినిమా చేయబోతున్నాడు ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు శంకర్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే చాలు దాని మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి…ఆయన సినిమా వస్తుందన్నా కూడా ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక అతనికి అవకాశం ఇచ్చే హీరో ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగిన వాళ్లకి మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలంపాటు కొనసాగే అవకాశం ఉంటుంది.
వాళ్ళ మార్కెట్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక సక్సెస్ లేని వాళ్ళను ఎవరు పట్టించుకోరు. ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకులు కూడా వాళ్లను మర్చిపోతుంటారు. ఒక డైరెక్టర్ ని క్యాలీక్లెట్ చేయడంలో ప్రేక్షకులు ముందు వరుసలో ఉంటారు. ఒక దర్శకుడు విజువల్ గా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తున్నాడా? లేదా అనేది కూడా ప్రేక్షకులు ఐడెంటిఫై చేస్తుంటారు. ఇక మొత్తానికైతే శంకర్ ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది కీలకంగా మారింది…