Homeఎంటర్టైన్మెంట్Tollywood : టాలీవుడ్ లో సొంతంగా ఎదిగిన హీరోలు ఎవరు? వారి కష్టాలు కన్నీళ్లు తెలుసా?

Tollywood : టాలీవుడ్ లో సొంతంగా ఎదిగిన హీరోలు ఎవరు? వారి కష్టాలు కన్నీళ్లు తెలుసా?

Tollywood : క‌ల ప్ర‌తి ఒక్క‌రూ కంటారు.. దాన్ని నెర‌వేర్చుకునేవారు మాత్రం అతి కొద్ది మందే.. సినీరంగం వంటి గ్లామ‌ర్ ఫీల్డ్ కు వ‌చ్చిన‌ప్పుడు.. స‌క్సెస్ అయిన వారి సంఖ్య మ‌రింత త‌క్కువ‌గా ఉంటుంది. మ‌రి, మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి అండా లేకుండా అడుగు పెట్టిన వారెవ్వ‌రు? స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ ను నిర్మించుకొని శిఖ‌రాగ్రాన్ని తాకిన‌వారెవ్వ‌రు? వాళ్లు అనుభవించిన కష్టాలు ఏంటీ? అన్న‌ది ఈ స్టోరీలో చూద్దాం.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ్వ‌రి సపోర్టూ లేకుండా.. స్వ‌యంకృషితో ఎదిగిన వ్య‌క్తి అన‌గానే మొద‌ట‌గా మ‌దిలో మెదిలే పేరు చిరంజీవి. కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆయ‌న‌.. చిన్న చిన్న పాత్ర‌లు వేశారు. ఆ త‌ర్వాత విల‌న్ వేషాలూ వేశారు. ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకున్నారు. సుప్రీం హీరోగా ఎదిగారు. త‌న విజ‌య ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూ మెగాస్టార్ అయ్యారు. తెలుగు సినీ చ‌రిత్ర‌లో మ‌కుఠం లేని మ‌హారాజుగా రెండు ద‌శాబ్దాల పాటు నెంబ‌ర్ వ‌న్ గా వెలుగొందారు.

అయితే.. ఇదంతా రాత్రికి రాత్రి ఆయాచితంగా వ‌చ్చిప‌డిన స్టార్ డ‌మ్ కాదు. చిరంజీవి అకుంఠిత దీక్ష‌కు ఫ‌లిత‌మిది. అనిత‌రసాధ్య‌మైన కృషికి అందిన విజ‌య‌మిది. 150 చిత్రాలు చేసిన త‌ర్వాత కూడా.. ఇప్ప‌టికీ ఆయ‌న చేస్తున్న సినిమాను మొద‌టి సినిమాగానే ఫీల‌వుతారు. అంత‌లా క‌ష్ట‌ప‌డుతుంటారు. మ‌రి, మొద‌టి సినిమా నుంచి ఆయ‌న ఇంకెంత క‌ష్ట‌ప‌డి ఉంటారు? అందుకే.. ఆయ‌న అంద‌రూ అంగీక‌రించే మెగాస్టార్ అయ్యారు.

మోహ‌న్ బాబు.. ఈయ‌న చిరంజీవి స‌మ‌కాలికుడు. సినిమా ఇండ‌స్ట్రీలో హీరోగా కెరియ‌ర్ ను మొద‌లు పెట్టిన‌ప్ప‌టికీ.. విజ‌యాలు వ‌రించ‌క‌పోవ‌డంతో విల‌న్ గా న‌టించారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా న‌టించారు. ఆ త‌ర్వాత తిరిగి హీరో పాత్ర‌లు వేశారు. ఆ విధంగా న‌ట ప్ర‌పూర్ణ‌, క‌లెక్ష‌న్ కింగ్ అనిపించుకున్నారు.

హీరో రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఎవ‌రి అండా లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. క‌మెడియ‌న్ గా చాలా చిత్రాల్లో న‌టించారు. విల‌న్ గానూ చేశారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా స‌త్తా చాటారు. ఆ త‌ర్వాత హీరోగా కెరీర్ కొన‌సాగించారు.

ఎవ‌రి స‌పోర్టూ లేకుండా ఇండ‌స్ట్రీలో ఎదిగిన వారిలో ర‌వితేజ ఒక‌రు. ఎన్నో అనామ‌క పాత్ర‌లు వేశాడు ర‌వితేజ‌. గుంపులో గోవింద పాత్ర‌ల్లో న‌టిస్తూనే.. మంచి రోజుల కోసం ఎదురు చూశారు. ఆ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ఇచ్చిన అవ‌కాశంతో హీరోగా అద్భుత‌మైన కెరీర్ నిర్మించుకున్నారు. మాస్ మ‌హ‌రాజ్ అంటూ దూసుకెళ్తున్నారు.

హీరో శ్రీకాంత్ కూడా సోలోగానే వ‌చ్చేశారు. ఆయ‌న కూడా మొద‌ట్లో ప‌లు సినిమాల్లో విల‌న్ గా న‌టించారు. ఆ త‌ర్వాత హీరోగా మారారు. ఫ్యామిలీ హీరోగా త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను బాల‌య్య కాంబోలో రాబోతున్న అఖండ సినిమాలో మ‌ళ్లీ విల‌న్ గా మారారు.

హీరోగా ఫామ్ లో ఉన్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఎవ‌రి స‌పోర్టు లేకుండానే ఎదిగారు. కెరీర్ తొలి నాళ్ల‌లో చిన్న చిన్న పాత్ర‌లు చేశారు. ‘నువ్విలా’ చిత్రంలో ఒక అనామ‌క పాత్ర వేశారు. ఆ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో ఒక‌ పాత్ర చేశారు. ఆ త‌ర్వాత పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా మారారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version