
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఇప్పుడు అగ్రహీరోలు బయట నిర్మాతలకు చేసే కన్నా సొంత బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చే లాభాలన్నీ తీసుకుంటూ దర్శకులకు కావాల్సినంత ఇస్తూ భారీ ఫ్రాఫిట్ సంపాదిస్తున్నారు. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, చిరంజీవి, ప్రభాస్ సహా ఎంతో మంది హీరోలకు నిర్మాణ సంస్థలున్నాయి. ఇప్పుడు అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇటీవల బాలీవుడ్ .. హాలీవుడ్ సూపర్ స్టార్ల అడుగుజాడలను అనుసరిస్తున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోలు నిర్ణీత రెమ్యూనరేషన్ తో పాటు, వారు తమ నిర్మాణ సంస్థలను చిన్న భాగస్వాములుగా సినిమాలో చేర్చుకోవడం ద్వారా లాభాలలో వాటాను కూడా కోరుతున్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ను తన రాబోయే సినిమాల్లో తప్పనిసరిగా నిర్మాణ భాగస్వామిగా చేర్చేలా నిర్ణయం తీసుకున్నాడు.
ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. కొత్త ప్రొడక్షన్ హౌస్ యువ సుధ ఆర్ట్స్ ప్రధాన నిర్మాణ భాగస్వామి కాగా… కళ్యాణ్ రామ్ కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ చిత్రంలో భాగస్వామిగా ఉండబోతోంది.
అదేవిధంగా పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కలయికలో తీయబోయే చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తుండడం విశేషం. ఈ ప్రశాంత్ నీల్ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా వాటా తీసుకోనున్నారు.
అల్లు అర్జున్ సైతం తన సినిమాల్లో తన బంధువులు లేదా స్నేహితులను భాగస్వాములుగా చేర్చుకుంటున్నాడు. మహేష్ బాబు తన సోదరి మంజుల లేదా అతడి సోదరుడు రమేష్ మైనర్ భాగస్వాములను చేయడం ద్వారా ఇంతకు ముందు సినిమాలు చేశాడు. ఇటీవల మహేష్ బాబు తన కొన్ని సినిమాలను సొంత నిర్మాణ సంస్థ జీఎంబీలోనే సినిమాలు తీస్తున్నాడు.