https://oktelugu.com/

Hero Yash: అసిస్టెంట్ ఇంటికి వెళ్లి మరీ ఆ పని చేసిన హీరో యశ్.. అంతా అవాక్కు

కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు యశ్. ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా ఇంత బిజీ టైమ్ లో కడా తన వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని మరోసారి చాటి చెప్పారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 15, 2024 / 12:15 PM IST
    Follow us on

    Hero Yash: రాక్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినా పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ సాధించి తన సత్తా చాటాడు ఈ స్టార్ హీరో. ఈయన నటించిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు సూపర్ హిట్ సక్సెస్ ను అందుకోవడమే కాదు. కలెక్షన్ కింగ్ గా నిలిచాయి కూడా. ఈ సిరీస్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు యశ్. దీంతో ఈయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. మరి ఈ సినిమాల తర్వాత మళ్లీ ఎప్పుడు కనిపించబోతున్నాడు అంటూ ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు యశ్. ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా ఇంత బిజీ టైమ్ లో కడా తన వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని మరోసారి చాటి చెప్పారు. తన కోసం పనిచేసే వారిని ఎప్పటికీ మర్చిపోను అని చాటిచెప్పాడు యశ్. ఈ క్రమంలోనే తన అసిస్టెంట్ ఇంటికి సడన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. అంతే కాదు వారి బాబుకు కూడా ఓ భారీ గిఫ్ట్ ఇచ్చారట.

    సెలబ్రెటీలు తమ కోసం పనిచేసే వారికి ఎప్పుడు అండగానే ఉంటారు. వారి ఇంట్లో చిన్న వేడుక జరిగినా హాజరై.. తమ మంచి మనసు చాటుకుంటారు. ఇక మరికొందరు సడెన్ గా సర్పైజ్ చేస్తూ ఉంటారు. తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కూడా అదే పని చేశారు. తన అసిస్టెంట్ చేతన్ కు ఇచ్చిన సర్పైజ్ తో అందరూ ఆనందిస్తున్నారు. అయితే ఈయన 12 ఏల్ల నుంచి అసిస్టెంట్ గా పనిచేస్తున్నారట. ఒక విధంగా చెప్పాలంటే యశ్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి అన్నమాట. ఇక చేతన్ వివాహం 2021లో జరిగింది. ఆ పెళ్లికి సైతం యశ్ దంపుతులు వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు.

    పెళ్లికి రావడం మాత్రమే కాదు ఇప్పుడు మరోసారి తన అసిస్టెంట్ ఇంటికి వచ్చి అది కూడా సడన్ గా షాక్ ఇచ్చాడు. ఈ ఊహించని గిఫ్ట్ కు దంపతులు కూడా ఆనందించారు. అయితే చేతన్ కు కొన్ని రోజుల క్రితం కుమారుడు జన్మించారు. ఇక టాక్సిక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆయన వెళ్లలేకపోయారు. ఇప్పుడు కాస్త టైం చూసుకొని తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లివచ్చారు యశ్. అంతే కాదు గోల్డ్ చైన్ బహుమతిగా కూడా ఇచ్చారు. ఇక ఈయన సింప్లిసిటీకి అభిమానులు ప్రశంసిస్తున్నారు.