Hero Yash Car: ‘కేజీఎఫ్’ స్టార్ యశ్.. ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్లలో ఒకరు. ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీయకుండా, చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు ఇతను కొన్న కొత్త లగ్జరీ కారు గురించి, దాని నంబర్ ప్లేట్ గురించి టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన యశ్, తన రేంజ్‌కి తగ్గట్టే లగ్జరీ లైఫ్ స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు. ఖరీదైన ఇల్లు, కార్లు ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు ముంబైలో ఎక్కువ సమయం షూటింగ్స్ కోసం గడుపుతున్నాడు కాబట్టి, అక్కడ తిరగడానికి ఒక కొత్త కారు కొన్నాడు.
Also Read: తల్లిదండ్రులు, సోదరుడు చనిపోయారు.. మూడేళ్లుగా ఆ రూం దాటి బయటకు రాలేదు.. ఓ టెకీ విషాద గాథ
ఆ కారు పేరు లెక్సస్ LM 350h 4S అల్ట్రా లగ్జరీ. ఈ కారు రణ్‌బీర్ కపూర్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోల దగ్గర మాత్రమే ఉందంట. దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.3 కోట్లు. ఎక్స్-షోరూం ధరనే రూ.2.65 కోట్లు. యశ్ నీలం రంగు కారును కొన్నాడు. దీని రిజిస్ట్రేషన్ ఏప్రిల్‌లో మహారాష్ట్రలో జరిగింది. కారు ఎంత ఖరీదైనదో, దాని నంబర్ ప్లేట్ కూడా అంతే స్పెషల్.. యశ్ కొన్న కారు నంబర్ MH 47 CB 8055. ఇక్కడ ఉన్న ‘8055’ నంబర్‌కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఎందుకంటే, ఈ నంబర్ ఇంగ్లీష్‌లో ‘BOSS’ లాగా కనిపిస్తుంది. అందుకే ఈ నంబర్‌కి ‘బాస్ నంబర్’ అని పేరుంది.
ఈ నంబర్ కావాలంటే చాలా ఖర్చు అవుతుంది. లక్షల రూపాయలు అదనంగా కట్టి ఆర్టీఓ నుంచి ఈ నంబర్‌ను కొనుక్కోవాలి. అంతేకాదు, యశ్ దగ్గర ఉన్న అన్ని కార్లకు ఇదే 8055 నంబర్ ఉంది. ఇప్పుడు కొన్న లెక్సస్ కారును తన సొంత నిర్మాణ సంస్థ ‘మాన్ స్టర్ మైండ్స్’ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. యశ్ కొన్న లెక్సస్ LM 350h 4S అల్ట్రా కారు ప్రస్తుతం ఇండియాలో ఉన్న వాటిలో చాలా కంఫర్ట్‌బుల్ కార్లలో ఒకటి. ఇది హైబ్రిడ్ కారు, అంటే పెట్రోల్, ఎలక్ట్రిసిటీ రెండింటితో నడుస్తుంది.
ఈ కారులో సూపర్ లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లు, మసాజ్ సీట్లు, ప్రతి సీటుకు ఒక స్క్రీన్, ఒక చిన్న ఫ్రిజ్, ఆటోమేటిక్ డోర్స్ వంటివి ఉన్నాయి. ఇలా చాలా ఖరీదైన ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో బెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది.