Vijay setupathi: సైడ్ క్యారెక్టర్ గా తన నటనా జీవితాన్ని మొదలుపెట్టి హీరోగా, విలన్ గా విభిన్నమైన పాత్రలు నటించి తమిళ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ కి ఎదిగారు విజయ్ సేతుపతి.ఎటువంటి పాత్రలోనైనా హావభావాలను పలికించగల నటుడిగా తెలుగు తమిళ ప్రేక్షక అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు మక్కల్ సెల్వన్. ఇటీవలే విజయ్ సేతుపతి పై ఎయిర్పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే ఆ వీడియో ఇంటర్నెట్లో లో వైరల్ అయ్యింది.దీనిపై సేతుపతి స్పందిస్తూ ఇది చిన్న విషయం అంటూ ఆ వ్యక్తి మా వ్యక్తి ఒక చిన్నపాటి గొడవ అది ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయ్యాక కూడా కొనసాగింది అతనుతాగిన మైకంలో ఉన్నాడు కాస్త మతిస్థిమితం కొల్పోయి ఆ విధంగా ప్రవర్తించారు దీనిని పెద్ద ఇష్యూ చేయకండి అంటూ చెప్పుకొచ్చారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా సెక్యూరిటీ గార్డులు నిర్మించుకోవడం ఇష్టం లేదని నాకు తోడుగా నా స్నేహితుడు ఉంటారని అతను నాకు 30 ఏళ్లుగా తెలుసు, అతనే నా మేనేజర్ గా అన్ని వ్యవహారాలు చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అభిమానులను కలవడానికి,వారితో ఫొటోస్ దిగడానికి మాట్లాడటానికి నేను ఇష్టపడతాను.ఇటువంటి ఘటన జరిగినంత మాత్రానా అభిమానం కలవకుండా ఉండని ఇప్పుడు కూడా అభిమానులను కలుస్తూనే ఉంటాను అని
చెప్పుకొచ్చారు సేతుపతి. ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వం లో ‘కాతు వాకుల రెండు కాదల్, కమల్ హాసన్ తో “విక్రమ్” బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో “లాల్ సింగ్ చద్దా” తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు తాజాగా రెజీనా సేతుపతి జంటగా నటించిన “ముఘీజ్హ్ ” నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది .