Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనది ఒక ప్రత్యేక శైలి. ఆ స్టైల్ లోనే సినిమాలను తెరకెక్కిస్తూ… నిత్యం వార్తల్లో నిలిస్తు ఉంటారు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి దాకా సంచలనాలు సృష్టించడం అంటే ఆర్జీవి కె చెల్లిందని చెప్పాలి. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లడ్ కీ సినిమా గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ ట్వీట్టర్ వేదిక గా విడుదల చేశారు. మహిళా మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే మొదటిది కావడం విశేషం. చైనో ఇండియా సినిమాగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా భాల్కేర్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అయితే మార్షల్ ఆర్ట్స్ తో పాటు ఈ మూవీ లో అందాల ఆరబోత కూడా గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ లో కూడా అందాల ఆర్బోతను విడిచిపెట్టలేదు ఆర్జీవి. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమా లు అంటేనే హీరోయిన్ ల అందాల ఆరబోత ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా లో వర్మ కాస్త డోస్ పెంచాడనే చెప్పాలి. కాగా, రామ్గోపాల్ వర్మ బ్రూస్లీకి ఎంత అభిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒకానొక సందర్భంలో ఆర్జీవీ చెప్పారు. ఈ సినిమా కోసం పూజాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సినిమాకు జింగ్ లియు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలానే రవి శంకర్ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.