Chiranjeevi-Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇప్పటివరకు ఆయన చేసిన విజయాలు ఒకత్తు అయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి కూడా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి సినిమాలను చేస్తూ అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే వీళ్లిద్దరి క్రియేట్ అవుతుంది అలాగే వీళ్ళ సినిమాలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే 2000 సంవత్సరంలో మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోల రికార్డ్ లను ఒక యంగ్ హీరో కొల్లగొట్టడనే విషయం మనలో చాలామందికి తెలియదు… 2000 సంవత్సరంలో చిరంజీవి ‘అన్నయ్య ‘ (Annayya) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా 19 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘బద్రి ‘ (Badri) సినిమా సైతం 18 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడం విశేషం… ఇక ఈ రెండు సినిమాలను బీట్ చేస్తూ యంగ్ హీరో అయిన తరుణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ చేసిన ‘నువ్వే కావాలి’ సినిమా 20 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడం విశేషం…
ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల రికార్డ్ లను బ్రేక్ చేస్తూ భారీ విజయాన్ని అందుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. మొదటి సినిమాతోనే ఇద్దరు స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేసిన తరుణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు వెలుగొందుతాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ హీరో చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉంటాడు అనుకున్న ప్రతి ఒక్కరికి షాక్ అయితే ఇచ్చాడు…ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న ఆయన మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…