
ఈ మధ్య టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు హీరోలు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరోలు రానా, నిఖిల్, నితిన్ పెళ్లిళ్లు చేసుకొని బ్యాచ్‌లర్ లైఫ్‌కి బైబై చెప్పారు. ఇప్పుడు అదే బాటలో లవర్ బాయ్ తరుణ్ వెళ్తున్నారంట.
Also Read: వరుస సినిమాలతో దూసుకుపోతున్న నభా నటేష్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన తరుణ్ బాల నటుడిగా ఆదిత్య 369లో మెరిశారు. ఇక హీరోగా మారి టాలీవుడ్‌లో లవర్ బాయ్ అనే పదానికి నిదర్శనంగా నిలిచాడు. ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. మిలీనియం మొదట్లో నువ్వే కావాలి అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బాణాలు గుచ్చేసాడు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఈ కుర్ర హీరో కోసం కలలు కన్నారు.
ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను లాంటి సినిమాలు తరుణ్‌ను ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ‘శశిరేఖా పరిణయం’, ‘నవవసంతం’ వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే ఆయన కెరీర్ గాడి తప్పింది. ఆర్తి అగర్వాల్‌తో ప్రేమాయణం లైఫ్‌ని డిస్టర్బ్ చేసింది. కెరీర్ పరంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఆమెని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఆమె దూరం కావడంతో తరుణ్ మానసికంగా మరింతగా కుంగిపోయాడు. దీంతో సినిమాలకు కూడా దూరమయ్యాడు.
Also Read: పేరుకే చిన్నవి టెక్కులో మాత్రం పెద్దవి !
ప్రస్తుతం తరుణ్ హాయిగా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తరుణ్ పెళ్లి మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా తరుణ్‌కు మంచి సంబంధం కోసం వెతుకుతోందట అతని తల్లి రోజా రమణి. ఇన్నాళ్లకు ఆ అమ్మాయి దొరికిందని వార్తలు వస్తున్నాయి. తనకు తెలిసిన వాళ్లలోనే ఓ స్నేహితురాలి కూతుర్ని తరుణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది. ఇప్పటికే తరుణ్ వయసు 37 ఏళ్లు దాటిపోయింది. మొత్తానికి ఈ 2020లో చాలా మంది టాలీవుడ్ హీరోలతోపాటే తరుణ్ కూడా గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారనేది సమాచారం.