Hero Surya : సౌత్ ఇండియన్ టాప్ స్టార్స్ లో ఒకరైన హీరో సూర్య పాపులర్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం లో ‘వాడివాసల్’ అనే సినిమా చేస్తున్నాడు..సూర్య కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..వెట్రిమారన్ కెరీర్ లో ఇప్పటి వరుకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేకపోవడం..సూర్య కి సరైన టైం లో సరైన డైరెక్టర్ తో మూవీ పడడం తో సూర్య కం బ్యాక్ గా ఈ చిత్రం కచ్చితంగా నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ లో నేడు అపశృతి చోటు చేసుకుంది..ఫైట్ మాస్టర్ సురేష్ షూటింగ్ లో జరిగిన ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు..ఈ దుర్ఘటన మూవీ యూనిట్ ని మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ శోకసంద్రం లోకి నెట్టేసింది..అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాల్లోకి ఒకసారి వెళ్దాం.
చెన్నైలోని కేలంబాక్కం లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది..సినిమాకి కీలకంగా ఉండే ఒక పోరాట సన్నివేశం కి గాను..జంపింగ్ షాట్ లో పైన నుండి దూకాల్సి ఉంది..ఎంతో జాగ్రత్తలతో సేఫ్టీ ప్రికాషన్స్ తోనే షూటింగ్ చేసాము..కానీ ప్రమాదం జరిగిపోయింది..ప్రమాదం జరిగిన వెంటనే అతనిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాము కానీ దురదృష్టం కొద్దీ అతనిని కాపాడుకోలేక పోయాము అంటూ మూవీ టీం చెప్పుకొచ్చింది.
స్టంట్ మాస్టర్ సురేష్ సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరితో పని చేసాడు..శంకర్ తీసిన సినిమాల్లో కూడా ఆయన స్టంట్ మాస్టర్ గా పని చేసాడు..అలాంటి డిమాండ్ ఉన్న స్టంట్ మాస్టర్ కి ఇలా జరగడం నిజంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కి తీరని లోటు అనే చెప్పాలి..ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని..ఆయన కుటుంబ సబ్యులకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.