https://oktelugu.com/

Hero Suriya : మరో ప్రయోగం చేయబోతున్న సూర్య.. వర్కౌట్ అవుతుందంటారా..?

Kollywood గజిని సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సూర్య...ప్రస్తుతం సౌత్ లో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒకడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : July 22, 2024 / 06:25 PM IST

    Hero Suriya is going to do another experimental film

    Follow us on

    Hero Suriya : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఈ జనరేషన్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు మాత్రం సూర్య అనే చెప్పాలి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఆయన ప్రతి క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. నిజానికి ఆయన చేసే ప్రతి పాత్ర కూడా జనానికి అంతలా కనెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సొసైటీలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ని సినిమాగా ఎంచుకొని చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఇక ఒకప్పుడు చేసిన గజిని, ఆరు, యముడు లాంటి సినిమాలు తెలుగులో కూడా ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. నిజానికి ఆయన తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అలాంటి సూర్య ఇప్పుడు ‘కంగువ ‘ సినిమాతో ఒక భారీ ప్రయోగాన్ని చేస్తున్నాడు. అలాగే పాన్ ఇండియా లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సూర్య ఈ సినిమాని తప్పకుండా సక్సెస్ తీరాలకు చేర్చాలనల్నే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా తెరకెక్కుతుంది. ఇక సినిమా సినిమాకి మధ్య జానర్ ని చేంజ్ చేస్తూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడం లో సూర్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.

    కాబట్టి ఆయనకి తెలుగు తమిళ్ లో చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సూర్య మరొక డిఫరెంట్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పేరును సంపాదించుకున్న ‘వెంకట్ ప్రభు’ డైరెక్షన్ లో సూర్య ఒక సినిమా చేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో సూర్య బ్లైండ్ క్యారెక్టర్ ని పోషించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వెంకట్ ప్రభు విజయ్ హీరోగా గోట్ అనే సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమా అయిపోయిన వెంటనే సూర్యతో ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తనకు ఒక కాన్సెప్ట్ ని కూడా చెప్పి ఒప్పించారట. ఇక దానికి సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ ప్రాజెక్టుని వీలైనంత తొందరగా చేయబోతున్నారట… ఇక ఈ సినిమాలో సూర్య బ్లైండ్ గా ఉంటూనే మరొక క్యారెక్టర్ లో ఇంకొక షెడ్ లో కూడా నటించబోతున్నాడట. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి సూర్య సినిమా మొత్తం బ్లైండ్ గా కనిపిస్తాడా లేదంటే కొద్దిసేపు మాత్రమే బ్లైండ్ పాత్రను పోషిస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

    ఇక మొత్తానికైతే తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా సూర్య కూడా పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటూ మంచి సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు…ఇక ‘కంగువ ‘ సినిమాతో అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య వెంట వెంటనే సినిమాలకు కమిట్ అయి వరుస సినిమాలను చేయడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి….చూడాలి మరి వరుస సినిమాలతో సూర్య ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు అనేది…