Hero Surya: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులు ఎవరు అంటే మనకి ముందు గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు సూర్య..పేరు కి మాత్రమే ఈయన తమిళ హీరో..కానీ తెలుగు లో మాత్రం ఈయనకి ఉన్న క్రేజ్ ని చూస్తూ మెంటలెక్కపోవాల్సిందే..ఇక్కడి స్టార్ హీరో రేంజ్ స్టేటస్ హీరో సూర్య సొంతం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..కేవలం తమిళం మరియు తెలుగు లో మాత్రమే కాదు..కేరళలో కూడా సూర్య కి ఉన్న క్రేజ్ మరో సౌత్ ఇండియన్ హీరో కి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..సినిమా కోసం సూర్య దేనికైనా తెగిస్తాడు..తన పాత్రలో జీవించడానికి తన శరీరాకృతిని మార్చుకుంటూ వస్తుంటాడు తన ప్రతి సినిమాతో..అందుకే సూర్య అంటే సౌత్ ఆడియన్స్ కి అంత పిచ్చి..అయితే లేటెస్ట్ గా ఒక సినిమా కోసం సూర్య చేసిన సాహసం చూస్తే మనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి..ప్రస్తుతం ఆ భయంకరమైన స్టంట్ కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే సూర్య ప్రస్తుతం తమిళ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ‘వాడివాసల్’ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు..తమిళనాడు సంస్కృతి లో ప్రసిద్ధి గాంచిన జల్లికట్టు ఆట ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఆ చిత్ర దర్శకుడు వెట్రిమారన్..అయితే సూర్య ఈ సినిమా కోసం నిజంగానే జల్లికట్టు ఆటని నేర్చుకుంటున్నాడు..ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమైన ఈ ఆటని నేర్చుకోవడానికి ఏ హీరో కూడా సాహసం చెయ్యదు..దూప్స్ ని పెట్టి లాగించేస్తారు..లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ తో మేనేజ్ చేస్తారు..కానీ వెండితెర మీద చూసే ప్రేక్షకులకు నిజంగా జల్లికట్టు ఆటని చూసే అనుభూతి కలగడం కోసం సూర్య స్వయంగా జల్లికట్టు ఆటని నేర్చుకొని రిస్క్ చెయ్యడానికి సిద్ధపడ్డాడు.
Also Read: Hero Nikhil: సీరియల్స్ లోకి అడుగుపెట్టిన హీరో నిఖిల్ సిద్దార్థ్

ఈ క్రమం లో జల్లికట్టు ఆటని షూటింగ్ స్పాట్ లో అభ్యసిస్తున్న సూర్య మీద కి ఒక ఎద్దు రంకెలేస్తూ వచ్చేసింది..అదుపు తప్పిపోయిన ఆ ఎద్దుని సూర్య ఎంతో ధైర్యంగా ఎదుర్కొని దానిని అదుపులోకి తీసుకొచ్చాడు..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..కేవలం ఒక సినిమా కోసం సూర్య ప్రాణాలకు తెగించి రిస్క్ చెయ్యడం ని చూసి ఆయన అభిమానులు గర్వపడుతున్నారు..గత కొంత కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య..ఈ సినిమా ద్వారా భారీ కం బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు.
[…] Also Read: Hero Surya: షూటింగ్ స్పాట్ లో ఘోరమైన ప్రమాదం… […]