Srinu Vaitla: టాలీవుడ్ లో వినోదాత్మక చిత్రాలు తియ్యడం లో జంధ్యాల మరియు EVV సత్యనారాయణ వంటి లెజెండ్స్ తర్వాత, అదే రేంజ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు శ్రీను వైట్ల..నీకోసం అనే సినిమా తో ప్రారంభమైన శ్రీను వైట్ల కెరీర్ ఆ తర్వాత ఆనందం , సొంతం,వెంకీ, ఢీ, దుబాయి శ్రీను,రెడీ, కింగ్ , దూకుడు మరియు బాద్షా వంటి సెన్సషనల్ హిట్స్ తో ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు..ఒకానొక్క దశలో శ్రీను వైట్ల తో సినిమాలు చెయ్యడం కోసం మన స్టార్ హీరోలు నెలల తరబడి వేచి చూసేవాళ్ళు కూడా..అయితే ఎప్పుడైతే శ్రీను వైట్ల కోన వెంకట్ మరియు గోపి మోహన్ లను వదిలేసాడో, అప్పటి నుండి ఆయనకి గడ్డుకాలం మొదలైంది..ఆయన వాళ్ళు లేకుండా తీసిన ఆగడు , బ్రూస్లీ , మిస్టర్ మరియు అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాలు భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..దీనితో శిఖరాలను చూసిన శ్రీను వైట్ల కెరీర్ ఒక్కసారిగా పాతాళ లోకం లోకి పడిపోయింది..ఇది పక్కన పెడితే శ్రీను వైట్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే శ్రీను వైట్ల తో విడాకులు కావాలంటూ ఆయన గారి సతీమణి రూప ఇటీవలే కోర్టు మెట్లు ఎక్కింది..శ్రీను వైట్ల తో సుమారు 20 ఏళ్ళు దాంపత్య జీవితం గడిపి ముగ్గురు పిల్లలకు జన్మ ని ఇచ్చిన తర్వాత విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో శ్రీను వైట్ల గారి భార్య రూప పై నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు..ఈ ఒక్క సంఘటన తో సోషల్ మీడియా లో శ్రీను వైట్ల పై నెటిజెన్స్ లో సానుభూతి ఒక రేంజ్ లో ఏర్పడింది.
Also Read: Hero Surya: షూటింగ్ స్పాట్ లో ఘోరమైన ప్రమాదం ని తప్పించుకున్న హీరో సూర్య..ఆందోళనలో ఫాన్స్

అయితే ఇటీవల సోషల్ మీడియా లో శ్రీను వైట్ల పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది..తన ముగ్గురు కూతురాలతో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ ‘ఈ ముగ్గురు నా ప్రాణం..వీళ్ళు లేకపోతే నాకు జీవితం లేదు’ అంటూ శ్రీను వైట్ల ఎంతో ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు..ఈ పోస్ట్ కింద అయన అభిమానులు బాధపడొద్దు అంతా మంచికే జరుగుతుంది అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు..ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Also Read:Hero Nikhil: సీరియల్స్ లోకి అడుగుపెట్టిన హీరో నిఖిల్ సిద్దార్థ్