Hero Nikhil: శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బసుతీ హిట్ అయ్యిందో..ఆ సినిమాలో రాజేష్ పాత్రలో నటించిన నిఖిల్ సిద్దార్థ్ పాత్ర కూడా అదే రేంజ్ లో హైలైట్ అయ్యింది..ఈ సినిమా ద్వారా లైంలైట్లోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత విభిన్నమైన కథలతో హీరో గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పరచుకున్నాడు..ముఖ్యంగా యూత్ లో నిఖిల్ కి మంచి క్రేజ్ ఏర్పడింది..ఇది కాసేపు పక్కన పెడితే 2014 వ సంవత్సరం లో నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా నిఖిల్ కి టాలీవుడ్ లో ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పరిచింది..అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా ఆయన నటించిన కార్తికేయ 2 ఆగష్టు నెలలో విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా నిఖిల్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ ప్రారంభించేసాడు.

అయితే రొటీన్ కి బిన్నంగా నిఖిల్ ప్రొమోషన్స్ విషయంలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు..మన ఆడియన్స్ మొత్తం అధిక శాతం టీవీ సీరియల్స్ కి మరియు ఎంటర్టైన్మెంట్ షోస్ కి బాగా అలవాటు పడిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ సీరియల్స్ ని తనకి ప్రొమోషన్స్ గా వాడుకునేందుకు సిద్దమయ్యాడు నిఖిల్..జీ టీవీ లో మంచి TRP రేటింగ్స్ ని తెచ్చుకుంటున్న డైలీ సీరియల్ ‘రాధమ్మ కూతురు’ లో నిఖిల్ నటించబోతున్నాడు.
Also Read: Modern Love Hyderabad Review: రివ్యూ : మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్

అయితే ఆయన ఈ సీరియల్ లో రెగ్యులర్ గా నటించాడు లేండి..కేవలం ఒక ఎపిసోడ్ లో కథని మలుపు తిప్పే ఒక అతిధి పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల చెయ్యగా..దానికి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇన్ని రోజులు కేవలం సినిమాల ద్వారా మాత్రమే బుల్లితెర పై కనిపించిన నిఖిల్ సిద్దార్థ్ ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక సీరియల్ లో కూడా కనిపించబోతుండడం వాళ్ళని కాస్త థ్రిల్ కి గురి చేస్తుంది..సోమవారం రోజు ఈ ఎపిసోడ్ జీ తెలుగు లో సాయంత్రం 7 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
[…] Also Read: Hero Nikhil: సీరియల్స్ లోకి అడుగుపెట్టిన హీర… […]