https://oktelugu.com/

Relationship: పెళ్లి చేసుకుంటున్నారా.. అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!

Relationship: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది కీలక నిర్ణయమనే సంగతి తెలిసిందే. పెళ్లి విషయంలో సరైన అడుగులు వేస్తే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందని పెళ్లి విషయంలో తప్పటడుగులు వేస్తే మాత్రం జీవితాంతం ఇబ్బందులు పడక తప్పదని చాలామంది భావిస్తారు. అమ్మాయికైనా, అబ్బాయికైనా పెళ్లి విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. లైఫ్ పార్ట్ నర్ ను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఎంచుకునే జీవిత భాగస్వామి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 9, 2022 / 04:42 PM IST
    Follow us on

    Relationship: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది కీలక నిర్ణయమనే సంగతి తెలిసిందే. పెళ్లి విషయంలో సరైన అడుగులు వేస్తే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందని పెళ్లి విషయంలో తప్పటడుగులు వేస్తే మాత్రం జీవితాంతం ఇబ్బందులు పడక తప్పదని చాలామంది భావిస్తారు. అమ్మాయికైనా, అబ్బాయికైనా పెళ్లి విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. లైఫ్ పార్ట్ నర్ ను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.

    Relationship

    మనం ఎంచుకునే జీవిత భాగస్వామి నాలుగు విషయాలలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో కచ్చితంగా గమనించాలి. మనం ఏదైనా తప్పు చేస్తే అవతలి వ్యక్తి ఆ తప్పును సరిద్దకపోయినా ఆ తప్పును ఎత్తిచూపుతూ ప్రవర్తించకుండా ఉంటే చాలని గుర్తుంచుకోవాలి. తప్పులను పదేపదే ఎత్తిచూపుతుంటే మాత్రం భవిష్యత్తులో కూడా పాత విషయాలను పదేపదే గుర్తు చేసి అవతలి వ్యక్తి ఇబ్బంది పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.

    Also Read: ప్రివిలేజ్ నోటీసుల‌తో యుద్ధం మొద‌లు పెట్టిన టీఆర్ఎస్

    ఏదైనా గొడవ జరిగిన సమయంలో సర్దుకుపోయే మనస్తత్వం అవతలి వ్యక్తిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోతే చిన్న గొడవ చివరకు పెద్ద గొడవగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. అవతలి వ్యక్తి మన జీవితంలోని ముఖ్యమైన తేదీలకు, ఇష్టాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాలను కూడా గమించాలి. అవతలి వ్యక్తిలో నచ్చని అలవాట్లను తెలియజేసి మన అభిప్రాయాలను ముందుగానే వ్యక్తపరచాలి.

    అవతలి వ్యక్తి అబద్ధాలు చెబుతున్నాడో లేదో జాగ్రత్తగా గమనించాలి. అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు. అబద్ధాలు చెప్పే వ్యక్తులకు నిజ జీవితంలో దూరంగా ఉంటే మంచిది. మనం చెప్పిన మాటలకు అవతలి వ్యక్తి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో గమనించాలి. అభిప్రాయాలు, అభిరుచులు కలవకపోతే అవతలి వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది.

    Also Read: 15 ఏళ్ల క్రితం మన తెలుగు ప్రముఖ నేతలు ఎలా ఉండేవారో తెలుసా? చూస్తే షాకింగే?