Hero Suman Daughter Marriage: కర్ణాటకకు చెందిన సుమన్ తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఆయన టాలీవుడ్ లో స్టార్ హీరో హోదా అనుభవించారు. ఒక దశలో ఆయన వరుస హిట్స్ ఇచ్చారు. సుమన్ పొరుగు రాష్ట్రం వాడని మనవాళ్లకు తెలియదు. లోకల్ హీరోగా ఆయన్ని ఆదరించారు. కెరీర్ పీక్స్ లో ఉండగా సుమన్ నీలి చిత్రాల కేసులో ఇరుక్కున్నారు. ఆయన స్నేహితుడు చేసిన నేరం ఆయన మెడకు చుట్టుకుంది. నెలల తరబడి సుమన్ జైల్లో ఉన్నారు. దుర్భర జీవితం గడిపారు.
సుమన్ బయటకు వచ్చాక కూడా హీరోగా రాణించారు. అయితే తనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయాలపై తాజాగా సుమన్ మరోసారి స్పందించారు. నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారని ఆయన వాపోయారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత వంటి హీరోయిన్స్ నాకు మద్దతుగా నిలిచారు. సుమన్ అలాంటి వ్యక్తి కాదని చెప్పారు. వారి స్టేట్మెంట్ నాకు హెల్ప్ అయ్యిందన్నారు. చేయని నేరానికి సుమన్ శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
కాగా సుమన్ కూతురు అఖిలజ ప్రత్యూష ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. సౌత్ ఇండియాకు చెందిన బిగ్ స్టార్ అఖిలజను కోడలు చేసుకోవాలనుకుంటున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తల మీద కూడా సుమన్ స్పందించారు. అవన్నీ నిరాధార కథనాలని కొట్టిపారేశారు. మా అమ్మాయి అఖిలజ హ్యూమన్ జెనెటిక్స్ మణిపాల్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది. మా అమ్మాయి పెళ్లి ఎవరితో కుదర్లేదు. చదువు పూర్తి అయ్యాక పెళ్లి చేస్తాను, అని అన్నారు.
ఆమెకు సినిమా పట్ల ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశారు. శివాజీ మూవీలో సుమన్ రోల్ గొప్పగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు. ఇటీవల తన మద్దతు బిఆర్ఎస్ పార్టీకే అని ఓపెన్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని గతంలో ఆయన జ్యోస్యం చేశారు.